సిద్ధు జాక్.. ఫుల్ జోష్ లో..

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

Update: 2024-09-06 17:21 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎల్బీడబ్ల్యూ, దాగుడుమూత దండాకోర్, గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల వంటి పలు సినిమాలు చేసిన సిద్ధు.. అనుకున్న స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. కానీ డీజే టిల్లు మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. స్టార్ బాయ్ గా మారి స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. తన యాక్టింగ్ అండ్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు.

రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సిద్ధు. డీజే టిల్లుకు మించిన విజయం సాధించారు. సినీ ప్రియులను కూడా అంతే రీతిలో అలరించారు. టిల్లు స్క్వేర్ మంచి హిట్ కావడంతో టిల్లు క్యూబ్ ను అనౌన్స్ చేశారు. అందుకు సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం జాక్- కొంచెం క్రాక్ మూవీ చేస్తున్నారు. ఆ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.

సిద్ధుకు జోడీగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా.. SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్, బాపినీడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న జాక్ మూవీ మేకర్స్.. తాజాగా స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు. హైదరాబాద్ లో ప్రజెంట్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నేపాల్ కు వెళ్లనున్నట్లు వెల్లడించారు.

సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నేపాల్ లో స్టార్ట్ కానున్న కొత్త షెడ్యూల్ తో 80 శాతం షూటింగ్ పూర్తి కానుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో సిద్ధు జొన్నలగడ్డ, ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, వైష్ణవి చైతన్యపై ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు. సంగీత దర్శకుడు అచ్చు రాజమణి మ్యూజికల్ వర్క్ ను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే సిద్ధు, భాస్కర్ కాంబోలో మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్త జానర్ లో తెరకెక్కుతున్న జాక్ మూవీ మంచి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆడియన్స్ కు క్రేజీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరి జాక్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News