అప్పుల‌తో 7 అంత‌స్తుల ఆఫీస్ ఔట్!

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయితే కోట్లు క‌ళ్ల ముందుంటాయి. లేదంటే ముఖం చూసే వాడు కూడా ఉండడు.

Update: 2024-06-24 06:57 GMT

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయితే కోట్లు క‌ళ్ల ముందుంటాయి. లేదంటే ముఖం చూసే వాడు కూడా ఉండడు. సినిమాలు నిర్మించి ఆస్తులు..అంత‌స్తులు కూడ‌బెట్టిన వారు ఉన్నారు. అదే సినిమా కోసం త‌పించి రోడ్డున ప‌డ్డ‌న వారు ఉన్నారు. సినిమా అనేది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని సైతం రోడ్డు మీద‌కు తెచ్చిన ఉదంతం తెలిసిందే. ఇదే స‌న్నివేశాన్ని డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ కూడా చూసారు. `లైగ‌ర్` ప్లాప్ అయిన త‌ర్వాత డిస్ట్రిబ్యూట‌ర్లు ఆయ‌న‌పై ఎలాంటి నిర‌స‌న‌కు దిగారో తెలిసిందే.

చివ‌రికి పూరి సైతం సీరియ‌స్ అయి దిక్కున్న చోట చెప్పుకోమ‌నే ప‌రిస్థితి ఎదురైంది. తాజాగా బాలీవుడ్ లో ఓ నిర్మాణ సంస్థ ప‌రిస్థితి ఇంత‌క‌న్నా దారుణంగా త‌యారైంది. బాలీవుడ్ నిర్మాత కం న‌టుడు, ర‌కుల్ ప్రీత్ సింగ్ భ‌ర్త జాకీ భ‌గ్నానీ ఇప్పుడు పీక‌ల్లోతు స‌మ‌స్య‌ల్లో ఉన్నాడు. వ‌రుస‌గా అత‌డు తీసిన సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతో ఉన్న ఆస్తుల్ని అమ్మాల్సిన ప‌రిస్థితి దాప‌రించింది.

ఇటీవ‌లే ఆయ‌న సంస్థ పూజా ఎంట‌ర్ టైన్ మెంట్స్ నుంచి రిలీజ్ అయిన `బ‌డేమియాన్ చోటే మియాన్` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయి డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. 350 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన సినిమా 90 కోట్ల వ‌సూళ్ల‌నే తెచ్చి పెట్టింది. దీంతో నిర్మాణ సంస్థ భారీగా దెబ్బ తింది. ఈ సినిమా రూపంలో 250 కోట్ల‌కు పైగా అప్పులు తేలాయి. దీంతో ముంబైలోని ఏడు అంత‌స్తుల పూజా ఎంట‌ర్ టైన్ మెంట్స్ కార్యాల‌యాన్ని అమ్మేసిన‌ట్లు తెలుస్తోంది.

ఓ ప్ర‌ముఖ బిల్డ‌ర్ దీన్ని ద‌క్కించుకున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. అయితే ఈ అమ్మ‌కానికి ఒక్క‌రోజు ముందు జీతాలు సక్ర‌మంగా చెల్లించ‌లేద‌ని ఉద్యోగుల నుంచి ఆరోప‌ణ‌లొచ్చాయి. దీంతో 80 శాతం స్టాప్ ని త‌గ్గించి మిగిలిన వారిని జుహూలోని ప్లాట్ కి కార్యాల‌యాన్ని త‌ర‌లించిన‌ట్లు ఓ నివేదిక చెబుతుంది. ఇప్పుడు అక్క‌డ నుంచే కార్య‌క‌లాపాలు అన్నింటిని నిర్వ‌హిస్తున్నారు.

పూజా ఎంట‌ర్ టైన్ మెంట్స్ కి చాలా చ‌రిత్ర ఉంది.1986లోనే ఈ సంస్థ‌ని ఏర్పాటు చేసారు. కానీ 1995 నుంచి సినిమాలు నిర్మించ‌డం మొద‌లు పెట్టారు. తొలి సినిమా `కూలీ నెంబ‌ర్ వ‌న్` ఆ త‌ర్వాత ఇదే సంస్థ‌లో చాలా సినిమాలు నిర్మించారు. అయితే గ‌త కొన్నేళ్ల‌గా ఈ సంస్థ‌లో నిర్మించిన సినిమాలేవి స‌రిగ్గా ఆడ‌టం లేదు. అవ‌న్నీ త‌క్కువ బ‌డ్జెట్ చిత్రాలే. క‌లిపితే భారీ బ‌డ్జెట్ బ‌డ్జెట్ అవుతుంది. చివ‌రిగా నిర్మించి న `బ‌డేమియాన్ చోటేమియాన్` కి ఏకంగా 350 కోట్ల‌కు పైగా వెచ్చించారు. ఇది ప్లాప్ అవ్వ‌డంతో అన్ని ర‌కాల అప్పులు బ‌య‌ట ప‌డుతున్నాయి. ఇంకా అప్పుల‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News