రకుల్ ఫ్యామిలీకి రూ.250 కోట్ల అప్పులా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులో నటించి చాలా నెలలు అవుతోంది

Update: 2024-06-25 12:46 GMT

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులో నటించి చాలా నెలలు అవుతోంది. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటూ అక్కడ బిజీ బిజీగా గడుపుతోంది అమ్మడు. తన ప్రియుడు, బీటౌన్ నిర్మాత జాకీ భగ్నానీని రీసెంట్ గా వివాహం చేసుకుంది. అయితే ఇటీవల రకుల్ కుటుంబం అప్పుల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వాటిని తీర్చడానికి ఆస్తి కూడా అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి.

రకుల్ ఫ్యామిలీకి చెందిన నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ ఉద్యోగులు తమ యజమాని జాకీ భగ్నానీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు జాకీపై రూ.250 కోట్ల అప్పుల భారం కూడా పడినట్లు వార్తలు వచ్చాయి. అందుకోసం ఆయన.. ముంబైలో 7 అంతస్తుల బిల్డింగ్ ను అమ్మినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ బిల్డింగ్ ను ఓ బడా బిల్డర్ కొన్నారని, దానిని కూల్చివేసి అదే స్థలంలో అపార్ట్మెంట్ నిర్మాణం జరగనుందని టాక్.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ.. భారీ అప్పులు కావడానికి కారణం సినిమాలే. జాకీ భగ్నానీతోపాటు ఆయన తండ్రి వషు భగ్నానీ నిర్మించిన మూడు చిత్రాల వల్ల వారి కుటుంబ పరిస్థితి ఇలా మారింది. తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో రూ.250 కోట్లకుపైగా నష్టం వచ్చింది. వాటి నుంచి జాకీ భగ్నానీ కుటుంబం కోలుకోలేకపోయింది.

గత ఏడాది.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో వషు భగ్నానీ.. మిషన్ రాణిగంజ్ సినిమా తీసిన విషయం తెలిసిందే. రూ.55 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా.. అక్షయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. రూ.46 కోట్లు మాత్రమే వసూలు చేయగా.. భారీ నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా వచ్చిన గణ్ పత్ మూవీ దారుణంగా ఫెయిల్ అయింది. భగ్నానీ ఆశలన్నీ అడియాశలయ్యాయి.

రూ.150 కోట్ల బడ్జెట్ తో రూపొందిన గణ్ పత్.. బాక్సాఫీస్ వద్ద రూ.14 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ తర్వాత తమకు రెండు ఫ్లాపులు ఇచ్చిన అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో భగ్నానీ ఫ్యామిలీ తీసిన చోటే మియా బడే మియా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ సినిమా రూ.102 కోట్లు వసూలు చేసింది. కానీ బడ్జెట్ మాత్రం రూ.350 కోట్లు. అలా ఆ మూడు సినిమాల ద్వారా అప్పుల్లో కూరుకుపోయింది రకుల్ ఫ్యామిలీ. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News