మన వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్.. హాలీవుడ్ హీరోకి కూడా..

ఇప్పుడు ఈ రెండు పాత్రలు కూడా మార్వెల్ నుంచి రాబోతున్న అప్ కమింగ్ మూవీలో ఉండనున్నాయి.

Update: 2024-07-05 14:14 GMT

ఇండియాలో కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇప్పుడు మరో సూపర్ హీరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇది సాధారణ సూపర్ హీరో మూవీ కాదు. ఇప్పటి వరకు విడివిడిగా డెడ్‌ పూల్, వోల్వారిన్ పాత్రలు మెప్పించాయి. ఇప్పుడు ఈ రెండు పాత్రలు కూడా మార్వెల్ నుంచి రాబోతున్న అప్ కమింగ్ మూవీలో ఉండనున్నాయి. డెడ్‌పూల్ & వోల్వారిన్ గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

డెడ్‌ పూల్ గా ర్యాన్ రేనాల్డ్స్, వోల్వారిన్ గా హ్యూగ్ జాక్‌ మాన్ కనిపించనున్నారు. షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా.. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నాయి. ఇండియాలో కూడా మార్వెల్ సినిమాలకు మంచి ఆదరణ ఉండటంతో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా.. జులై 26వ తేదీన విడుదల కానుంది ఈ చిత్రం.

ఫుల్ యాక్ష‌న్ అడ్వెంచర్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హ్యూగ్ జాక్‌ మాన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను ట్రేమెండస్ క్రికెట్ అభిమాని అని తెలిపారు. తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో కూడా చెప్పారు. అయితే హ్యూగ్ జాక్‌ మాన్ అభిమాన క్రికెటర్ ఎవరో కాదు.. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

Read more!

రీసెంట్ గా జరిగిన టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ క్రికెట్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. దానిపై కూడా హ్యూగ్ జాక్‌ మాన్ స్పందించారు. ఇటీవల వరల్డ్ కప్ లో రోహిత్ సేన గెలిచింది కదా అని అడగ్గా.. "నాకెందుకు తెలీదు. రోహిత్ ఒక బీస్ట్ లాగా ఆడుతాడు. నాకు హిట్ మ్యాన్ ఆట చూడడం చాలా ఇష్టం" అని తన అభిమానాన్ని చాటుకున్నారు హ్యూగ్ జాక్‌ మాన్.

ఇప్పుడు హ్యూగ్ జాక్‌ మాన్.. తన ఫేవరేట్ క్రికెటర్ రోహిత్ శర్మ అని చెప్పడంతో ఒక్కసారి హిట్ మ్యాన్ ఫ్యాన్స్ దృష్టిని ఆయన ఆకర్షించారు. తన మూవీపై కూడా మంచి బజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం హ్యూగ్ జాక్‌ మాన్ మాట్లాడిన వీడియో.. నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. మరి ఈ మూవీ ఇండియాలో ఎలాంటి హిట్ అవుతుందో.. ఎంతటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.



Tags:    

Similar News

eac