ఇక స్వేచ్ఛగా విదేశాలకు వెళ్లొచ్చు.. కోర్టులో జాకీకి ఊరట
నిబంధనలయ వల్ల ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని జాకీ కోర్టుకు నివేదిస్తూ ఈడీ నుంచి వెసులుబాటు కావాలని అభ్యర్థించింది.
మోసగాడు సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో పలువురు హీరోయిన్ల పేర్లు మీడియాలో ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సుఖేష్ తో శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ పేరు లింకప్ అయ్యి పదే పదే మీడియా హెడ్ లైన్స్‌లో వినిపిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో సుకేష్ -జాక్వెలిన్‌లను ప్రధాన అనుమానితులుగా పేర్కొంది. మరో భామ నోరా ఫతేహి పేరు ఇందులో వినిపించింది.
గత నవంబర్‌లో ఈ కేసులో జాక్వెలిన్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ విదేశాలకు వెళ్లడానికి కనీసం మూడు రోజుల ముందు ఆమె తన ప్రయాణ ప్రణాళికను EDకి అందించాల్సిన పరిస్థితి ఉంది.
తన పని షెడ్యూల్ కారణంగా చాలా తరచుగా విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని కొన్నిసార్లు తాను షార్ట్ నోటీసులో ప్రయాణించాల్సి వస్తోందని ED టైమ్‌లైన్‌కు కట్టుబడి ఉండలేని పరిస్థితి ఉందని కోర్టుకు వెల్లడించింది. నిబంధనలయ వల్ల ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని జాకీ కోర్టుకు నివేదిస్తూ ఈడీ నుంచి వెసులుబాటు కావాలని అభ్యర్థించింది.
ఎట్టకేలకు ఢిల్లీ పాటియాలా కోర్టు ఈ పిటిషన్‌ను విచారించింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లవచ్చని పేర్కొంటూ జాక్వెలిన్‌కు రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్‌ను పాస్ చేస్తున్నప్పుడు ఆమె ఇటీవలి ప్రవర్తనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
జాకీ ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా విదేశాలకు వెళ్లవచ్చు. మోసగాడు సుకేష్ నుంచి రకరకాల బహుమతులు అందుకోవడం అతడితో ప్రేమాయణం సాగించడం జాక్విలిన్ కి ముప్పుగా మారాయని ఈడీ విచారణలో తేలింది. మనీ మ్యాటర్స్ సంబంధాలు ఈ కేసులో కీలక పాత్రను పోషిస్తున్నాయి.