జైలర్ లీక్... చరిత్రలో మొదటిసారి
అది కూడా సాధారణ క్వాలిటీ కాదు హై క్వాలిటీ తో జైలర్ సినిమా లీక్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం జైలర్ భారీ వసూళ్లు సాధించింది.. ఇంకా సాధిస్తూనే ఉంది. భారీ ఎత్తున వసూళ్లతో దూసుకుపోతున్న జైలర్ సినిమాను అతి త్వరలోనే ఓటీటీ మరియు శాటిలైట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. థియేటర్ లో చూడలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో జైలర్ సినిమా ఆన్ లైన్ లో లీక్ అయింది. సాధారణంగా థియేటర్ రిలీజ్ అయిన సినిమా లు వాయిస్ నాయిస్ తో, ప్రింట్ సరిగా లేకుండా ఉండి లీక్ అవుతాయి. ఎప్పుడైతే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతాయో అప్పుడు కాస్త క్వాలిటీగా లీక్ అవుతాయి. కానీ జైలర్ సినిమా ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వకుండానే క్వాలిటీ తో లీక్ అయింది.
అది కూడా సాధారణ క్వాలిటీ కాదు హై క్వాలిటీ తో జైలర్ సినిమా లీక్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. తమిళ వర్షన్ కు చెందిన జైలర్ హెచ్ డీ ప్రింట్ బయటకు రావడం తో ఇండస్ట్రీ వర్గాల్ల వారు షాక్ అవుతున్నారు. ఇలా లీక్ అయింది అంటే అది కచ్చితంగా ప్రొడక్షన్ హౌస్ కు చెందిన ఎవరో ఒకరు కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
హెచ్ డీ ప్రింట్ లీక్ అయిన కొన్ని గంటల్లోనే లక్షల మంది ఆన్ లైన్ ద్వారా షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హెచ్ డీ ప్రింట్ సైజ్ 10 జీబీ ఉంది అంటే ఏ స్థాయి లో సినిమా క్వాలిటీ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. హోం థియేటర్ లో ప్రదర్శిస్తే థియేటర్ లో కంటే బాగా కనిపించేంత క్వాలిటీ తో లీక్ అయింది.
ఇప్పటి వరకు థియేటర్ రిలీజ్ అయిన ఏ ఒక్క సినిమా కు కూడా ఇలా హెచ్ డీ ప్రింట్ మొత్తంకు మొత్తం సినిమా లీక్ అవ్వడం జరగలేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. జైలర్ సినిమా కే మొదటి సారి ఇలాంటి అనుభవం ఎదురయింది. కాపీ ప్రింట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.