జైలర్ ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యిందా?
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరియర్ లో చాలా ఏళ్ల తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా జైలర్ చిత్రం నిలిచింది
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరియర్ లో చాలా ఏళ్ల తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా జైలర్ చిత్రం నిలిచింది. రోబో తర్వాత సూపర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే సాలిడ్ మూవీ అయితే పడలేదు. రోబో 2.ఓ సినిమాకి కలెక్షన్స్ భారీగా వచ్చిన చాలా అంశాలలో ప్రేక్షకులని నిరాశ పరిచింది. ఇక మిగిలిన సినిమాల సంగతి అంటే సరిసారి. కేవలం కమర్షియల్ సక్సెస్ అనిపించుకున్నాయి తప్ప బ్లాక్ బస్టర్ ఇమేజ్ ని సొంతం చేసుకోలేదు.
అయితే నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీ అందరి అంచనాలు మిచిపోయి మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పక్కా కమర్షియల్ లెక్కలతో సిద్ధం చేసుకున్న కథతో జైలర్ సినిమాని దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కించారు. అయితే రజినీకాంత్ క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేసిన విధానం, పవర్ ఫుల్ ఎలివేషన్ కి తోడు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఇంటరెస్టింగ్ క్యామియో రోల్స్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్లాయి.
మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా కుదరడంతో జైలర్ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ ఇచ్చారు. దీంతో అన్ని భాషలలో కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ 2 రికార్డులని బ్రేక్ చేస్తూ 500 కోట్ల మార్క్ ని జైలర్ మూవీ క్రాస్ చేసింది. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ 2.ఓ పేరు మీద హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డు ఉంది.
ఈ రికార్డుని అందుకునే అవకాశం లేకపోవచ్చు. దీనికి కారణం సినిమా ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండటమే. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ జైలర్ మూవీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. మూవీ రిలీజ్ అయినా నాలుగు వారల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారంట. దీంతో నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు జైలర్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమైపోతోంది. సెప్టెంబర్ 7న స్ట్రీమింగ్ చేయాలని అనుకుంటున్నారంట.
ఒక వేళ అదే జరిగితే మాత్రం జైలర్ లాంగ్ రన్ కలెక్షన్స్ మీద కచ్చితంగా గట్టి ప్రభావం పడుతుంది. డిజిటల్ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే కంప్లీట్ గా డ్రాప్ అయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రోబో 2.ఓ రికార్డుని బ్రేక్ చేసే అవకాశాన్ని మేకర్స్ చేజేతులా వదులుకున్నట్లు అవుతుంది. ఈ లోపు నిర్మాతలు డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీ నెట్ ఫ్లిక్స్ తో మాట్లాడి మరో రెండు, మూడు వారాలు డిజిటల్ రిలీజ్ హోల్డ్ చేసే అవకాశం ఉంటుందేమో చూడాలి.