టైటానిక్ దర్శకుడు కామెరూన్ మరో విషాద కథతో..
టైటాన్ సబ్ మెర్సిబుల్ డిజాస్టర్
టైటాన్ సబ్ మెర్సిబుల్ డిజాస్టర్ కు సంబంధించిన కథాంశంతో 'ఓషన్ గేట్' అనే చిత్రాన్ని రూపొందిస్తుండగా.. ఈ చిత్రంలో టైటానిక్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ ప్రమేయం గురించి ఊహాగానాలు సాగుతున్నాయి. జూన్ 22న టైటానిక్ శిధిలాల ప్రదేశాన్ని అన్వేషించడానికి వెళ్ళి తప్పిపోయిన సబ్ మెర్సిబుల్ కోసం అన్వేషణ సముద్రపు అడుగుభాగంలో సబ్ మెర్సిబుల్ కి సంబంధించిన శిధిలాలను చివరికి కనుగొన్నారు.
పరిశోధనల్లో టైటాన్ పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని కథనాలొచ్చాయి. ఓషన్ గేట్ సీఈఓ స్టాక్ టన్ రష్... బ్రిటీష్ పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ దావూద్... బ్రిటీష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్ ... టైటానిక్ నిపుణుడు పాల్-హెన్రీ నార్గోలెట్ సబ్ మెర్సిబుల్ లో ప్రయాణించి మరణించిన వారిలో ఉన్నారు.
సంఘటన తర్వాత U.S. కోస్ట్ గార్డ్ శిధిలాల అన్వేషణలో మానవ అవశేషాలను వెలికితీసినట్లు కథనాలొచ్చాయి. శిథిలాల నుండి జాగ్రత్తగా వెలికితీసిన ఈ అవశేషాలు తదుపరి విశ్లేషణ పరీక్షల కోసం మెరైన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (MBI)కి బదిలీ చేయబడ్డాయి.
ఓషన్ గేట్ చలనచిత్రం చుట్టూ ఉన్న పుకార్లను జేమ్స్ కామెరాన్ దృఢంగా ఖండించినందున టైటాన్ సబ్ మెర్సిబుల్ విపత్తుపై కొనసాగుతున్న పరిశోధన సంబంధిత శిధిలాల పునరుద్ధరణ ప్రయత్నాలపై అభిమానుల దృష్టి మరలింది.
టైటానిక్ .. కామెరూన్ కెరీర్ లోనే చాలా స్పెషల్ సినిమా. ప్రమాదానికి గురై మునిగిపోతున్న ఓడలో హృద్యమైన ప్రేమకథతో టైటానిక్ సినిమాని రూపొందించారు. ప్రేమకథా చిత్రాల్లోనే ప్రత్యేకమైన సినిమాగా టైటానిక్ ఎన్నటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.
ఇక టైటానిక్ సినిమా తీసే క్రమంలో టైటానిక్ ప్రమాదానికి గురైన చోటును సందర్భించిన కామెరూన్ నీటి అడుగున శిధిలాలను కూడా వీక్షించారు. అందుకే టైటాన్ సబ్ మెర్సిబుల్ మిస్సింగ్ సమయంలో కామెరూన్ ఈ కథపై దృష్టి సారించి ఉంటారని సహజంగానే అందరూ గెస్ చేసారు. కానీ ఆ గెస్ నిజం కాదని కామెరూన్ స్వయంగా క్లారిటీనిచ్చారు.