ఒక్క ఫోటోతో డేటింగ్‌ పుకార్లా.. అంత వ‌ద్దు!

ముంబై- బాంద్రాలో జనాయ్ బోంస్లే తన 23వ పుట్టినరోజు వేడుకల ఫోటోల‌ను షేర్ చేసారు. ఈ ఫోటోగ్రాఫ్స్‌లో టీమిండియా క్రికెట‌ర్ సిరాజ్‌తో కలిసి ఉన్న ఒకే ఒక్క‌ ఫోటోగ్రాఫ్‌ డేటింగ్ పుకార్లకు తెర‌తీసింది.

Update: 2025-01-26 09:30 GMT

సోషల్ మీడియా కొత్త పెయిర్ గురించి గుస‌గుస‌లాడుతోంది. ప్ర‌స్తుతం జ‌నం దృష్టి ప్రముఖ గాయని ఆశా భోంస్లే మనవరాలు, నటి కం గాయని జనాయ్ భోంస్లే - భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ పైనే ఉంది. ముంబై- బాంద్రాలో జనాయ్ బోంస్లే తన 23వ పుట్టినరోజు వేడుకల ఫోటోల‌ను షేర్ చేసారు. ఈ ఫోటోగ్రాఫ్స్‌లో టీమిండియా క్రికెట‌ర్ సిరాజ్‌తో కలిసి ఉన్న ఒకే ఒక్క‌ ఫోటోగ్రాఫ్‌ డేటింగ్ పుకార్లకు తెర‌తీసింది. నెటిజన్లు వారి స్నేహానికి పుల‌కించిపోయారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో జ‌రుగుతోందంటూ వ్యాఖ్యానించారు.

ఈ ఫోటోగ్రాఫ్ లో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా చ‌న‌వు క‌నిపించింది. జనాయ్- సిరాజ్ ఒకరినొకరు ప్రేమ‌గా చూసుకుంటూ త‌న్మ‌యంలో క‌నిపించారు. జనాయ్ అమ్మమ్మ ఆశాజీ, నటుడు జాకీ ష్రాఫ్, క్రికెటర్లు సిద్ధేష్ లాడ్, శ్రేయాస్ అయ్యర్ త‌దిత‌రులు ఈ పార్టీలో ఉన్నారు. అయితే అంత‌మందిలో ఆ ఇద్ద‌రి ప్ర‌త్యేక ఫోటోగ్రాఫ్ అంద‌రి దృష్టిని క‌ట్టిప‌డేసింది.

అయితే ఈ పుకార్లపై జ‌నాయ్ కానీ, సిరాజ్ కానీ స్పందించ‌లేదు. బోంస్లే మీరు సిరాజ్ భాయిజాన్ ని పెళ్లి చేసుకోబోతున్నారా? అని ఒక నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. డిఎస్పి సాహబ్ అంటే యహా మే పిగల్ గయా అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. ఈ ఊహాగానాలకు తగ్గ‌ట్టే సిరాజ్ త‌దుప‌రి ఐపీఎల్ సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ లో చేరడాన్ని ప‌లువురు ఫ్యాన్స్ ప్ర‌త్యేకంగా పాయింట్ అవుట్ చేసారు. జ‌నాయ్ స్వ‌రానికి ఎవ‌రైనా ప్రేమ‌లో ప‌డిపోవాల్సిందే. ఆ మ‌ధుర స్వ‌రానికి ఇప్ప‌టికే భారీ ఫాలోవ‌ర్స్ ఏర్ప‌డ్డారు. అందువ‌ల్ల సిరాజ్ త్వ‌ర‌ప‌డితేనే మంచిద‌ని కూడా కొంద‌రు సూచిస్తున్నారు.

త్వ‌ర‌లోనే జ‌నాయ్ కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ తో అభిమానుల ముందుకు రానుంది. మ‌రోవైపు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌తో కొత్త‌ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. కొత్త సీజ‌న్‌లో ఇత‌రుల‌ను అత‌డు బౌల్డ్ చేస్తాడో లేదా అత‌డే ఆమెకు క్లీన్ బౌల్డ్ అవుతాడో చూడాలి అంటూ కొంద‌రు ప‌రిహాసం ఆడుతున్నారు. ప్రేమో మోహ‌మో స్నేహ‌మో కాస్త ఆగితే క్లారిటీ వ‌చ్చేస్తుంది.. జ‌స్ట్ వెయిట్! అని ఒక అభిమాని వ్యాఖ్యానించాడు. సంగీతం క్రికెట్ జ‌త‌గా క‌లిస్తే మంచిదేగా అని కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఈ అంద‌మైన జంట నెటిజ‌నుల మ‌న‌సు దోచుకుంది.

Tags:    

Similar News