జాన్వీ ఈసారి కేర్ ఫుల్ గానే..!
ఐతే సినిమాలో గ్లామర్ పరంగా అమ్మడు మార్కులు కొట్టేసింది.
అందాల భామ జాన్వి కపూర్ బాలీవుడ్ లో తన మెరుపులు మెరిపిస్తూనే సౌత్ సినిమాల మీద ఫోకస్ చేసింది. ఎన్ టీ ఆర్ దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ సినిమాలో తంగం పాత్రలో నటించి మెప్పించింది. దేవర సినిమాలో జాన్వి కపూర్ కేవలం గ్లామర్ కి తప్ప అంత ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేయలేదని తెలిసిందే. ఐతే సినిమాలో గ్లామర్ పరంగా అమ్మడు మార్కులు కొట్టేసింది.
ఐతే తొలి సినిమా కాబట్టి దేవరలో జాన్వి కపూర్ ని ఓకే అనేశారు కానీ ప్రతి సినిమా ఇలా కేవలం గ్లామర్ కోసం మాత్రమే అనుకుంటే మాత్రం చాలా కష్టం. కేవలం గ్లామర్ షో చేయడానికైతే చాలామంది ఉంటారు. కానీ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన వారే హృదయాల్లో స్థానం సంపాదిస్తారు. అందుకే కొందరు హీరోయిన్స్ కేవలం నటనకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటారు.
జాన్వి కపూర్ అంతగా స్కిన్ షో చేయాలంటే ఫోటో షూట్స్ చేసినా సరిపోతుంది. కానీ ఆమె ఒరిజినల్ టాలెంట్ ఏంటన్నది తెలియాలంటే మాత్రం మంచి మంచి పాత్రలు పడాలి.. వాటిని ఆమె రక్తికట్టించాలి. సో దేవరలో ఆ ఛాన్స్ మిస్ అయ్యింది కాబట్టి ఆర్సీ 16 లో అయినా ఆమెకు మంచి రోల్ పడితే జాన్వి ఫ్యాన్స్ ఖుషి అయ్యే ఛాన్స్ ఉంటుంది. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. చిరంజీవి, శ్రీదేవిది సూపర్ హిట్ జోడీ కాగా వారి వారసులు రాం చరణ్, జాన్వి కపూర్ ల జంట తెర మీద ఎలాంటి అద్భుతాలు చేస్తుందో అని మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవరలో తన ప్రభావం ఏమాత్రం చూపించలేని జాన్వి కపూర్ చరణ్ సినిమాతో మాత్రం లెక్క మార్చాలని చూస్తుంది. సౌత్ లో గ్లామర్ ఇమేజ్ కన్నా అభినయంతో మెప్పించే హీరోయిన్స్ కే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అది జాన్వి కనిపెడితే మాత్రం సౌత్ లో కూడా సత్తా చాటేలా ఉంటుందని చెప్పొచ్చు.