వారసురాలు అక్కడా లాంచ్ అయ్యేదెప్పుడు?
అమ్మడు 'ధడక్' తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వక ముందే మామ్ లా సౌత్ ఇండస్ట్రీ నుంచి నార్త్ కి వెళ్తుందని ప్రచారం జరిగింది.
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ తొలుత కోలీవుడ్ లో లాంచ్ అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అమ్మడు 'ధడక్' తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వక ముందే మామ్ లా సౌత్ ఇండస్ట్రీ నుంచి నార్త్ కి వెళ్తుందని ప్రచారం జరిగింది. తల్లి సెంటిమెంట్ ని రిపీట్ చేసి దేశంలో పెద్ద స్టార్ అవుతుంద ని..దానికి సంబంధించిన ప్లానింగ్ అంతా బ్యాకెండ్ లో డాడ్ బోనీ కపూర్ చేస్తున్నాడని మీడియా కథనాలు ఓ రేంజ్ లో వెడెక్కించాయి.
కానీ అమ్మడు సైలెంట్ గా టాలీవుడ్ లో 'దేవర' తో లాంచ్ అయి ట్విస్ట్ ఇచ్చింది. విషయం కన్పమ్ అయిన తర్వాత మాత్రం జాన్వీపై మంచి హైప్ క్రియేట్ అయింది. మామ్ లాగే టాలీవుడ్ కి కనెక్ట్ అయిపోతుందని భావించారంతా. కానీ 'దేవర' విషయంలో అది జరగలేదు. పైపెచ్చు విమర్శలు ఎదుర్కుంది. పాత్ర పరంగా..నటన పరంగా జాన్వీ తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. మరి ఆర్సీ 16 తోనైనా విమర్శలకు చెక్ పెడుతుందేమో చూడాలి.
ఈ నేపథ్యంలో జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే అంశం మళ్లీ తెరమీదకు వస్తుంది. సొగసరి తమిళ్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. మామ్ శ్రీదేవి కోలీవుడ్ లోనూ సంచలనమైన తారగా వెలిగిన నేపథ్యంలో తమిళ సినిమాల్లోనూ తనయ నటించాలని అభిమానులు ఆశపడు తున్నారు. మరి వాళ్ల కోరిక జాన్వీ ఎప్పుడు తీరుస్తుందో చూడాలి.
ప్రస్తుతానికి జాన్వీ కపూర్ టాలీవుడ్, బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. కోలీవుడ్ ఆలోచన చేస్తున్నట్లు ఎక్కడా కనిపించలేదు. దేవర సినిమా విషయంలో విమర్శలు ఎదుర్కున్న నేపథ్యంలో తదుపరి సినిమాతో వాటిని తొలగిం చుకోవాలని కష్టపడుతుంది. ఆర్సీ 16 తో నటిగా తెలుగింట ఫేమస్ అవ్వాలని చూస్తోంది. పైగా తెలుగు సినిమా పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో కొన్నాళ్ల పాటు ఇక్కడే సినిమాలు చేస్తే బాగుండనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితుల నుంచి అందుతోన్న సమాచారం.