అంబానీ పెళ్లి: రిహన్నకు జాన్వీ ఏం నేర్పిస్తోంది?
రిహన్న - జాన్వీ కపూర్ జింగాత్ కోసం కలిసి డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేసి "ఈ మహిళ ఒక దేవత. స్టాప్ సెండాఫ్" అని క్యాప్షన్ ఇచ్చింది.
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ల ప్రీవెడ్డింగ్ ఉత్సవాల్లో పాల్గొనడానికి పాప్ స్టార్ రిహాన్న తన తొలి భారత పర్యటనకు విచ్చేసింది. రిహాన్న జామ్‌నగర్‌లో ఉన్న సమయంలో డే1 ఈవెంట్లో బాలీవుడ్ యువనాయిక జాన్వీ కపూర్ పాపులర్ సాంగ్ `జింగాత్`కి స్టెప్పులు నేర్పిస్తూ కనిపించింది. తుమ్కాలో ప్రావీణ్యం సంపాదించడానికి రిహన్నాకి జాన్వీ మార్గనిర్దేశం చేస్తున్న వీడియో ఆకట్టుకుంటోంది.
రిహన్న - జాన్వీ కపూర్ జింగాత్ కోసం కలిసి డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేసి ``ఈ మహిళ ఒక దేవత. స్టాప్ సెండాఫ్`` అని క్యాప్షన్ ఇచ్చింది. వీడియోపై స్పందిస్తూ ఒక అభిమాని ఇలా రాశాడు. జాన్వీ కపూర్ జింగాత్ లో రిహన్నా డ్యాన్స్ చేస్తోంది !!! ఐకానిక్ .. అని ఒకరు రాయగా..బాడీ (రిహన్న) ఈ బ్యాంగర్ (sic)పై మెలితిప్పడం బావుందని మరొకరు రాసారు.
అంబానీల పెళ్లిలో తన పెర్ఫార్మెన్స్తో అలరించేందుకు రిహన్న ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు. `వి ఫౌండ్ లవ్` సహా తన గొప్ప హిట్ పాటలను ఆలపించడం ద్వారా గాయని ప్రేక్షకులను ఆకర్షించింది. అనంత్ - రాధిక జంట వివాహానికి రిహాన్న అభినందనలు తెలియజేసింది.
జాన్వీతో పాటు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, అనిల్ కపూర్, సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, అనన్య పాండేతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆదిత్య రాయ్ కపూర్ వివాహానికి ముందు జరిగిన వేడుకల్లో పాల్గొనేందుకు జామ్‌నగర్‌కు వెళ్లారు.