అమ్మమ్మ వడిలో అమ్మ.. జాన్వీకపూర్ ఎమోషనల్ పోస్ట్
జాన్వీ రాసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు మామ్ శ్రీదేవి అభిమానుల్లో వైరల్ గా మారుతోంది.
అతిలోక సుందరి శ్రీదేవి 60వ పుట్టినరోజు (13ఆగస్టు) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సోషల్ మీడియాల్లో సంస్మరించుకున్న సంగతి తెలిసిందే. పరిశ్రమ అభిమానులు ట్వీట్లు ఇన్ స్టా పోస్టులతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇక శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ తన మాతృమూర్తికి చెందిన అరుదైన ఫోటోలను షేర్ చేసారు. అంతేకాదు జాన్వీ ఒక అరుదైన ఆన్ లొకేషన్ ఫోటోని షేర్ చేసి, ఎమోషనల్ నోట్ ని రాసారు.
ఈ ఫోటోగ్రాఫ్ లో శ్రీదేవి ముమ్మా (అమ్మ) ఒడిలో కూచుని ఎంతో హాయిగా నవ్వులు చిందిస్తూ కనిపించింది. టీనేజ్ లో శ్రీదేవి అందచందాలు ముగ్ధమనోహర రూపం ఎలా ఉంటుందో ఈ ఫోటోలో ఆవిష్కృతమైంది. బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి దశాబ్ధాల పాటు నటిగా అజేయంగా కొనసాగిన శ్రీదేవి టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసనా నటించారు. కోలీవుడ్ బాలీవుడ్ లో అగ్ర నాయికగా ఏలారు. కానీ ఆన్ లొకేషన్ తన తల్లిగారితో గడిపిన అరుదైన ఆ క్షణం మరపురానిది.
జాన్వీ రాసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు మామ్ శ్రీదేవి అభిమానుల్లో వైరల్ గా మారుతోంది. "పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. మీ ముమ్మా సెట్‌లో ఉన్నప్పటి ఫోటో ఇది. సినిమా సెట్‌లో ఇది మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి అని నాకు తెలుసు. ఈ రోజు నేను మీలానే సెట్‌లో ఉన్నందున, మీరు నాతో ఇలా ఉండాలని నేను గతంలో కంటే ఎక్కువగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇది వాస్తవానికి మీ 35వ పుట్టినరోజు .. 60వ పుట్టినరోజు కాదు అని అందరినీ ఒప్పించగలం. నేను హార్డ్ వర్క్ చేస్తున్నానా లేదా? అన్నది నువ్వే చెప్పు. నేను నిన్ను గర్వించేలా చేయగలిగానా లేదా నాతో చెప్పు. నాకు తెలుసు.. మీరు నన్ను ప్రతిరోజూ చూస్తున్నారని.. మీరు ఈ గ్రహం మీద అత్యంత ప్రత్యేకమైన మహిళ. మీరు ఇప్పటికీ మాతో ఉన్నారని నాకు తెలుసు. మేము ఇలా కొనసాగడానికి కారణం మీరే..నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఈ రోజు మీరు చాలా పాయసం ఐస్ క్రీమ్‌లు పంచదార పాకం తింటున్నారని ఆశిస్తున్నాం.." అని సుదీర్ఘ నోట్ లో పేర్కొన్నారు. నోట్ ఆద్యంతం జాన్వీలోని ఆవేదన ఎమోషన్ హృదయాలను తాకుతోంది. జాన్వీకపూర్ నేటితరంలో బిజీయెస్ట్ కథానాయికగా కెరీర్ ని సాగిస్తున్న సంగతి తెలిసిందే. కానీ మామ్ శ్రీదేవి లేని లోటు ఈ స్టార్ కిడ్ ని ఎన్నటికీ వెంటాడుతూనే ఉంటుంది.