.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

జాన్వీకపూర్ డెబ్యూ ఆశ‌లు వాయిదా!

అటు టాలీవుడ్..ఇటు కోలీవుడ్ అంటూ సంబ‌ర‌ప‌డింది. కానీ కోలీవుడ్ లో అమ్మ‌డి డెబ్యూ మూడు రోజుల ముచ్చ‌ట‌గానే క‌నిపిస్తుంది.

Update: 2024-06-29 11:21 GMT

జాన్వీ క‌పూర్ లో బాలీవుడ్ లో గ్రాండ్ స‌క్సెస్ అయింది. అంతే గ్రాండ్ గా టాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోంది. తొలి సినిమా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న 'దేవ‌ర‌'లో న‌టిస్తోంది. ఆ సినిమా రిలీజ్ కి ముందే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఛాన్స్ అందుకుంది. అమ్మ‌డు ఇంకా క‌మిట్ అవ్వాలేగానీ చాలా మంది హీరోలు క్యూలో ఉన్నారు. బ‌డా నిర్మాణ సంస్థ‌లు, ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు ఎదురు చూస్తున్నారు.

జాన్వీ చేసిన గెస్సింగ్ కంటే అమ్మ‌డికి ఇక్క‌డ బెస్ట్ లాంచింగ్ ద‌క్కింది. రిలీజ్ త‌ర్వాత ఫ‌లితాలు ఎలా ఉంటాయి? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి మామ్ శ్రీదేవి ఇమేజ్ తో మాత్రం కొన్నాళ్ల పాటు అమ్మ‌డి కెరీర్ కి ఇక్క‌డ తిరుగుండ‌దు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఇంతే గ్రాండ్ గా కోలీవుడ్ లో నూ లాంచ్ అవ్వాల‌ని ప్ర‌ణాళిక వేసుకుంది. అనుకున్న‌ట్లు గానే కోలీవుడ్ స్టార్ సూర్య స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ వ‌చ్చింది.

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం ప్రకాష్ మెహ‌తా సూర్య‌తో ఓ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని ప్లాన్ చేసారు. అందులో జాన్వీ అయితే ప‌ర్పెక్ట్ గా సూటువుతుంద‌ని ఆమెని ఎంపిక చేసారు. లుక్ టెస్ట్ కూడా చేసారు. పాత్ర‌కి ప‌ర్పెక్ట్ గా సెట్ అయింది. దీంతో జాన్వీ లో సంతోషం రెట్టింపు అయింది. అటు టాలీవుడ్..ఇటు కోలీవుడ్ అంటూ సంబ‌ర‌ప‌డింది. కానీ కోలీవుడ్ లో అమ్మ‌డి డెబ్యూ మూడు రోజుల ముచ్చ‌ట‌గానే క‌నిపిస్తుంది.

ఈ సినిమా అనివార్య కార‌ణాల‌తో తాత్కాలికంగా ఆపేసారుట‌. అందుకు గ‌ల కార‌ణాలు ఏంటి? అన్న‌ది తెలియ‌దు గానీ ప్రస్తుతానికి తెర‌కెక్కించే ఆలోచ‌న‌లో ఓం లేన‌ట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఆ ర‌కంగా జాన్వీ కోలీవుడ్ డెబ్యూ కాస్త నిరాశనే మిగిల్చింది. అయినా జాన్వీ క్రేజ్ కి మ‌రెన్నో అవ‌కాశాలు క్యూలో ఉండ‌నే ఉంటాయి. ఆమె ఎస్ అనేలాగానీ స్టార్ హీరోలే లైన్ లో ఉంటారు.

Tags:    

Similar News