పిక్ టాక్ : సైడ్‌ యాంగిల్‌ లోనూ అదిరింది

అందమైన జాన్వీ కపూర్‌ తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వైరల్‌ అవుతోంది.

Update: 2024-01-29 17:30 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా కమర్షియల్‌ హిట్‌ దక్కించుకోకున్నా కూడా తన ఫోటోల వల్ల తల్లి స్థాయి అందం అంటూ ఇప్పటికే నిరూపితం చేసుకుంది. అందమైన జాన్వీ కపూర్‌ తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వైరల్‌ అవుతోంది.

సైడ్‌ యాంగిల్‌ లో జాన్వీ కపూర్‌ పిక్స్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. బ్లాక్ డ్రెస్ లో పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా కూడా టైట్‌ డ్రెస్ లో జాన్వీ భలేగా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తూ అందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆకట్టుకునే రూపొంతో పాటు అందమైన జాన్వీ కపూర్‌ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.

ఈ స్థాయిలో అందంగా ఉండటం వల్లే జాన్వీ కపూర్‌ కి హిట్స్ దక్కకున్నా కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం తెలుగు సినిమా దేవర లో ఎన్టీఆర్‌ కి జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. దేవర జాన్వీ కి మొదటి కమర్షియల్‌ బ్రేన్ ను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేవర సినిమాతో పాటు హిందీలో కూడా ఒక సినిమాను ఈ అమ్మడు చేస్తోంది. సినిమాలతో పాటు సిరీస్ లను కూడా ఈ అమ్మడు చేయడం ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది. ఆకట్టుకునే అందంతో పాటు డాన్స్‌ ల్లో మరియు నటనలో మెల్ల మెల్లగా ఈ అమ్మడు ప్రావిణ్యం సాధిస్తూ హీరోయిన్‌ గా జెండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Tags:    

Similar News