వారం రోజుల్లో నా పెళ్లి...!

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ వరుస సినిమాలతో బిజీగా ఉంది

Update: 2024-05-29 09:36 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో ఈమె నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా విడుదలకు రెడీ అయ్యింది. క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఆ సినిమా పై జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకుంది. సినిమా కోసం చాలా కష్ట పడినట్లు చెప్పుకొచ్చింది.

ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా గత రెండు వారాలుగా మీడియాలో తెగ సందడి చేస్తూ జాన్వీ కపూర్‌ వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఒక చిట్ చాట్‌ లో జాన్వీ కపూర్‌ పెళ్లి వార్తల గురించి స్పందించింది. కొన్ని రోజుల గురించి పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు నేను చెప్పిన సమాధానం వక్రీకరించి ఎవరికి వారు ఊహించుకుంటున్నారు.

నేను వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. వారం రోజుల్లో కొందరు మీడియా వారు, సోషల్‌ మీడియాలో ఉన్న వారు నా పెళ్లి చేస్తారేమో అంటూ అసహనం వ్యక్తం చేసింది. నాకు తెలియకుండానే నా పెళ్లి పై పెద్ద ఎత్తున వార్తలు రావడం ఆశ్చర్యంగా ఉందని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తన దృష్టి మొత్తం కూడా సినిమాలపై ఉంది, ఎలాంటి ఆలోచన లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాను. కనుక పెళ్లి ఇప్పట్లో లేదు అన్నట్లుగానే జాన్వీ కపూర్ క్లారిటీ ఇచ్చింది. దాంతో వారం రోజుల్లో పెళ్లి అనేది కేవలం పుకార్లు మాత్రమే, సోషల్‌ మీడియా సృష్టి మాత్రమే అని తేలిపోయింది.

ప్రస్తుతం జాన్వీ కపూర్‌ తెలుగు లో ఎన్టీఆర్‌ కు జోడీగా దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. రెండు పార్ట్‌ లుగా విడుదల అవ్వబోతున్న దేవర సినిమా లో జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయి గా కనిపించబోతుంది. దేవర అక్టోబర్ 10న విడుదల అవ్వనుంది.

దేవర తో పాటు రామ్‌ చరణ్‌ కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించేందుకు ఇప్పటికే కమిట్‌ అయ్యింది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్ హీరోగా రూపొందబోతున్న సినిమా కోసం జాన్వీ కపూర్‌ ని అధికారికంగా ప్రకటించడంతో ఒకేసారి రెండు సినిమాల్లో జాన్వీ నటించబోతుంది.

Tags:    

Similar News