వంగ‌పువ్వు లో వ‌య్యారి భామ స‌య్యాట‌!

జాన్వీక‌పూర్ ఫ్యాష‌న్ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆల్ట్ర‌మోడ్ర‌న్ డిజైన్స్ అయినా ...ట్రెడీష న‌ల్ దుస్తుల్లోనైనా అమ్మ‌డు సెగ‌లు పుట్టిస్తుంది

Update: 2023-11-11 12:15 GMT

జాన్వీక‌పూర్ ఫ్యాష‌న్ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆల్ట్ర‌మోడ్ర‌న్ డిజైన్స్ అయినా ...ట్రెడీష న‌ల్ దుస్తుల్లోనైనా అమ్మ‌డు సెగ‌లు పుట్టిస్తుంది. అందులోనూ చీరందంలో కొలువు దీరిందంటే? ఆ బ్యూటీని మాట‌ల్లో వ‌ర్ణించ‌డం సాధ్యం కానిది. తాజాగా అమ్మ‌డు వంగ‌పువ్వు రంగు చీర‌లో త‌ళుకులీనింది. చీర‌.. ర‌విక‌లో జాన్వీ అందాల విందు పీక్స్ లో ఉంది. వంగ‌ప‌వ్వు రంగు చీర‌..ర‌విక‌లో వ‌య్యారి భామ ఒదిగిపోయింది.


360 డిగ్రీస్ లో అమ్మ‌డు అందాల ఆవిష్క‌ర‌ణ చూస్తే చీర‌లోనే ఇంత సాధ్య‌మా? అనిపిస్తుంది. లాంగ్ షాట్స్..క్లోజ‌ప్ షాట్స్ లో జాన్వీ ఎంపిక చేసుకున్న భంగిమ‌లు మ‌తి చెడేలా చేస్తున్నాయి. వీపు అందం నుంచి న‌డుము అందాల వ‌ర‌కూ జాన్వీ ట్రీట్ మామూలుగా లేదు. సొగ‌స‌రి ముస్తాబైన విధానం..మ్యాక‌ప్ ప్ర‌తీది జాన్వీని మ‌రింత అందంగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇక అమ్మ‌డు వీపునిండుగా పుట్టుమ‌చ్చ‌లు అంతే హైలైట్ అవుతున్నాయి.


భుజం ద‌గ్గ‌ర నుంచి చేయి...వెన్ను ముఖ భాగం వ‌ర‌కూ పుట్టుమ‌చ్చ‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ ఫోటోకి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఇలా ముస్తాబ‌వ్వ‌డం వెనుక ఏడిజైన‌ర్ గానీ..స్టైలిష్ గానీ లేరు. జాన్వీ స్వ‌యంగా సారీని ఎంపిక చేసుకుని..మ్యాక‌ప్ వేసుకుంది. ఇలా అందంగా ముస్తాబ‌వ్వ‌డం వ్య‌క్తిగ‌తంగా త‌న‌కెంతో న‌చ్చింది అంటోంది. రెగ్యుల‌ర్ లైఫ్ స్టైల్ కి భిన్నంగా అమ్మ‌డు ఇలా ట్రై చేసి స‌క్సెస్ అయింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. జాన్వీ అందానికి అభిమానులంతా ఫిదా అవుతున్నారు.

ఇక అమ్మ‌డి కెరీర్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్..టాలీవుడ్ ని ప‌రుగులు పెట్టిస్తుంది. 'దేవ‌ర' త‌ర్వాత టాలీవుడ్ లో మ‌రింత బిజీ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ కి ముందు కొత్త అవ‌కాశాలు వ‌రుస‌లో ఉన్నాయి. మ‌హేష్ ..రామ్ చ‌ర‌ణ్‌...బ‌న్నీ కి జోడీగా జాన్వీ ప‌ర్పెక్ట్ అంటూ అభిమానులు పోస్ట్ లు చేస్తున్నారు.

Tags:    

Similar News