ప‌క్ష‌వాతానికి గుర‌వుతున్నాను అనిపించింది!

హైద‌రాబాద్ వ‌చ్చేందుకు ప్లైట్ ఎక్కే ముందు ప‌క్ష‌వాతానికి గురైన భావ‌న క‌లిగింది. చివ‌రికి స‌హాయం లేకుండా వాష్ రూమ్ కి వెళ్ల‌లేక‌పోయాను.

Update: 2024-07-24 11:30 GMT

బాలీవుడ్ న‌టి జాన్వీక‌పూర్ ఇటీవ‌ల‌ కల్తీ ఆహారం కార‌ణంగా అనారోగ్యానికి గురైన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొంది ఇటీవ‌లే డిశ్చార్చ్ అయింది. దీంతో జాన్వీ పూర్తిగా కోలుకోవ‌డానికి ఇంకా రెండు..మూడు రోజులు స‌మ‌యం ప‌డుతుంద‌ని తండ్రి బోనీ క‌పూర్ తెలిపారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా జాన్వీ త‌న ఆరోగ్య విషయాలు తెలిపింది.

 

'ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస‌గా షూటింగ్ ల‌లో పాల్గొన్నా. ప్ర‌మోష‌న్స్ తోనూ బిజీగా గ‌డిపా. విశ్రాంతి లేకుండా వ‌రుస ప్ర‌యాణాలు చేసాను. దీంతో బాగా వీక్ అయ్యాను. ఓపాట షూటింగ్ కోసం చెన్నై వెళ్లా. అక్క‌డ చాలాసార్లు బ‌య‌ట తిన్నాను. దీంతో మొద‌ట క‌డుపులో నొప్పిగా అనిపించింది. ఆ త‌ర్వాత బాగా నీర‌సించాను. భ‌రించ‌లేనంత నొప్పి, ఒణుకు మొద‌లైంది. దీంటో ఆందోళ‌న‌కు గుర‌య్యాను.

హైద‌రాబాద్ వ‌చ్చేందుకు ప్లైట్ ఎక్కే ముందు ప‌క్ష‌వాతానికి గురైన భావ‌న క‌లిగింది. చివ‌రికి స‌హాయం లేకుండా వాష్ రూమ్ కి వెళ్ల‌లేక‌పోయాను. న‌డ‌వ‌డానికి ఓపిక‌లేద‌నిపించింది. దీంతో ఆసుప‌త్రికి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నా. మూడు రోజుల పాటు అక్క‌డే చికిత్స తీసుకున్నాను. అప్పుడే అర్ద‌మైంది అన్నింటి కంటే ఆరోగ్యం చాలా ముఖ్య‌మ‌ని. ఆసుప‌త్రిలో ఉన్న‌ని రోజులు తిరిగి డాన్సు చేయ‌గ‌ల‌నా? లేదా? అని భ‌య‌ప‌డ్డా.

ఇప్పుడు అన్ని స‌ర్దుకున్నాయి. వ‌ర్క్ లో బిజీ అవుతున్నాను' అని తెలిపింది. దీంతో జాన్వీ క‌పూర్ పూర్తిగా కొలుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం జాన్వీ తెలుగు సినిమా 'దేవ‌ర‌'లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే హిందీ లోనూ కొన్ని సినిమాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ముంబై టూ హైద‌రాబాద్ ప్ర‌యాణాలు ఎక్కువ‌య్యాయి.

Tags:    

Similar News