నాలుగు నెలలు జాన్వీ లాక్డ్
అవును.. నాలుగు నెలల పాటు జాన్వీ కపూర్ ఎటూ కదల్లేదు. కేవలం దేవర షెడ్యూల్స్ కోసమే సమయం కేటాయిస్తుంది. ఆ స్థాయిలో ప్లాన్ చేసారు దేవర దర్శకుడు కొరటాల శివ.
అవును.. నాలుగు నెలల పాటు జాన్వీ కపూర్ ఎటూ కదల్లేదు. కేవలం దేవర షెడ్యూల్స్ కోసమే సమయం కేటాయిస్తుంది. ఆ స్థాయిలో ప్లాన్ చేసారు దేవర దర్శకుడు కొరటాల శివ. ఈసారి రెండో షెడ్యూల్ లో మెజారిటీ భాగం జాన్వీ కపూర్ సన్నివేశాల్ని పూర్తి చేస్తారని సమాచారం. అక్టోబర్ 24న ఎన్టీఆర్ తో దేవర రెండవ షూట్ షెడ్యూల్‌ను మొదలు పెట్టగానే, ఈ షెడ్యూల్ లో జాన్వి చేరతారు. మొదటి షెడ్యూల్ లో 3 రోజులు మాత్రమే చిత్రీకరణలో పాల్గొన్న జాన్వీ ఈసారి సుదీర్ఘ షెడ్యూల్ లో బిజీ అవుతుంది. అక్టోబర్ నుండి గోవాలో చిత్రీకరణ సాగుతుంది. షూట్ షెడ్యూల్ జనవరి వరకు అంటే.. 3 నుండి 4 నెలల పాటు పొడిగిస్తారని తెలిసింది.
ఇంతకుముందు దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నామని దానికి తగ్గట్టుగానే కథ, కథనాలను అన్వేషించామని వెల్లడించారు. ఈ చిత్రం భారతదేశపు కోస్తా ప్రాంతం నేపథ్యంలో అంతగా గుర్తించని కథతో తెరకెక్కుతుంది. కాన్వాస్ చాలా పెద్దది.. అని కొరటాల వెల్లడించారు. నిజానికి మేం సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు కాన్వాస్ తనంతట తానుగా బయటపడింది. అంతకంతకు పెద్దదిగా మారింది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకం. వాటిని లోతుగా వివరంగా తెరపై ఆవిష్కరిస్తాం. లోతు ఉన్న కథల్ని ఒక భాగంలో సమర్థంగా చూపించలేం. అందుకే రెండు భాగాలుగా చిత్రీకరిస్తాం" అని తెలిపారు. కథ ఆకృతి మారదు కానీ స్థాయి పెద్దదిగా మారుతుందన్నారు. నందమూరి కళ్యాణ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
హిందీ సినిమాలకు బ్రేక్:
జాన్వీకపూర్ ఇప్పటికే సెట్స్ పై ఉన్న రెండు చిత్రాల్ని పూర్తి చేసింది. వీటిలో ఉల్జా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, మిస్టర్ అండ్ మిసెస్ మాహి కూడా విడుదల బరిలో ఉంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కోసం మాత్రమే జాన్వీ కపూర్ దేవర షూట్ నుంచి ముంబైకి వెళ్లాల్సి ఉంటుంది. కెరీర్ పరంగా ఇప్పటికే డజను వరకూ సినిమాల్లో నటించిన జాన్వీ కపూర్ కి దేవర చాలా ముఖ్యమైన సినిమా. దీంతో తనకు పాన్ ఇండియా హీరోయిన్ గా వెలిగిపోయే అవకాశం ఉంది. ఇటు దక్షిణాదితో పాటు ఉత్తరాదినా దేవర ఫ్రాంఛైజీ చిత్రాలు అత్యంత భారీగా విడుదలయ్యే అవకాశం ఉంది. కొరటాల మార్క్ కంటెంట్ హిందీ ఆడియెన్ ని మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.