15 ఏళ్ల వయసులోనే జాన్వీపై అలాంటి దాడి!
డీప్ పేక్ వీడియోకి తానేమి అతీతం కాదని తనకెదురైన అనుభవాన్ని గుర్తు చేసుకుంది. జాన్వీ 15 ఏళ్ల వయసులోనే మార్పింగ్ ఫోటోలకు గురైందిట.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో డీఫ్ పేక్ వీడియోలతో హీరోయిన్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న తొలిసారి డీప్ పేక్ బారిన పడటంతో మ్యాటర్ మరింత సంచలనంగా మారింది. అప్పటికే డీప్ పేక్ లు నడుస్తున్నా రష్మిక లాంటి నటి పై డీప్ పేక్ కి గురవ్వడంతో సెలబ్రిటీలంతా ఒక్కసారిగా షాక్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రష్మిక కి మద్దతుగా తారా లోకమంతా నిలిచింది.
ఆ తర్వాత పలువురు భామలు డీప్ పేక్ బారిన పడ్డారు. దీంతో డీప్ పేక్ అన్నది సహజంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. డీప్ పేక్ వీడియోకి తానేమి అతీతం కాదని తనకెదురైన అనుభవాన్ని గుర్తు చేసుకుంది. జాన్వీ 15 ఏళ్ల వయసులోనే మార్పింగ్ ఫోటోలకు గురైందిట. ఫోటోలతో పాటు తన ముఖంతో వీడియోలు కూడా రిలీజ్ చేసారంది.
అయితే ఈ విషయాన్ని అప్పుడు బయట చెబితే పాపులారిటీ కోసం చెప్పాననుకుంటారని సైలైంట్ గా ఉన్నట్లు వెల్లడించింది. పదిహేనేళ్ల వయసంటే? జాన్వీ అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుండొచ్చు. ఇక మార్పింగ్ ఫోటోల ట్రెండ్ అన్నది ఇప్పటిది కాదు. చాలా కాలంగా అందుబాటులో ఉంది. ఏఐ రాక ముందు చాలా మంది హీరోయిన్ల ఫేస్ మార్పింగ్ వీడియోలు..ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యేవి.
కాలక్రమంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ఆ రకమైన దాడిలో అడ్వాన్స్ టెక్నాలజీలు అందుబా టులోకి రావడంతో ఎక్కడ నుంచి ఏ వీడియో లీక్ అవుతుందో? నన్న టెన్షన్ సెలబ్రిటీల్లో మొదలైంది. తాజాగా ఏఐ తో కొత్త తలనొప్పి తయారైంది. టెక్నాలజీతో ఇన్ని రకాల ఇబ్బందులుంటాయని హీరోయిన్లు అంతా బెంబేలెత్తిపోతున్న సన్నివేశం ఇప్పుడు అన్ని పరిశ్రమల్లోనూ కనిపిస్తోంది.