జాన్వీ కపూర్ పెళ్లి పై ఇదే క్లారిటీ!

జాన్వీక‌పూర్ -శిఖ‌ర్ ప‌హారియా కొంత కాలంగా సీరియ‌స్ గా ల‌వ్ లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-05-08 06:37 GMT

జాన్వీక‌పూర్ -శిఖ‌ర్ ప‌హారియా కొంత కాలంగా సీరియ‌స్ గా ల‌వ్ లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టు జంట‌గా చిక్కిన సంద‌ర్భాలెన్నో. క‌లిసి ప‌బ్ ల‌కు వెళ్ల‌డం ద‌గ్గ‌ర నుంచి గుళ్లు గోపురాలు చుట్టేయ‌డం...తిరుప‌తి ద‌ర్శ‌నాల వ‌ర‌కూ ఈ జోడీ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అయింది. క‌ర‌ణ్ జోహార్ టాక్ షోలో సైతం శిఖ‌ర్ ప్ర‌స్తావ‌న్ రావ‌డం.. ఇటీవ‌ల రిలీజ్ అయిన `మైదాన్` షోకి శిఖు అనే లోగో ఉన్న చైన్ వేసుకోవ‌డం వంటివి జాన్వీ ప్రేమ‌ని మ‌రింత బ‌హిర్గతం చేసిన‌ట్లు అయింది.

దీంతో ఈ జంట వివాహానికి కూడా సిద్ద‌మ‌వు తున్న‌ట్లు ప్ర‌చారం అంత‌కంత‌కు ఠారెత్తిపోతుంది. ఇటీవ‌లే ఓ నెటి జ‌నుడు జాన్వీ పెళ్లి తిరుప‌తిలో జ‌రుగుతుంద‌ని.. బంగారం రంగు చీర క‌ట్టుకుంటుంద‌ని.. ఈవిష‌యాన్ని జాన్వీ స్వ‌యంగా త‌న‌కు చెప్పిన‌ట్లు పోస్ట్ పెట్టాడు. అది నెట్టింట వైర‌ల్ గా మారింది. జాన్వీపై ఉన్న ప్ర‌చారానికి తోడుగా ఇది మ‌రింత బ‌లంగా మారింది. ఆ నెటి జ‌నుడు జాన్వీ స్నేహితుడు..అందుకే అత‌డి ద్వారా విష‌యం బ‌య‌ట‌కు పొక్కింద‌ని కొంద‌రు భావించారు.

అయితే తాజాగా ఈ ప్ర‌చారాన్ని పోస్ట్ ని జాన్వీ ఖండించింది. `ఏదైనా రాస్తారా` అని ఖండించింది. ఈ పోస్ట్ కి అభిమానులు కూడా స‌ర‌దాగా స్పందించారు. మీకు కూడా తెలియ‌కుండా మీ పెళ్లి చేసేస్తున్నారు? అంటూ ఒక‌రు పోస్ట్ చేయ‌గా.. ఆ విష‌యం చెప్పింది మీ స్నేహితుడు కాదా? ఇంకా మీ స్నేహితుడు అనుకుంటున్నామంటూ మరొక‌రు కామెంట్ చేసారు. `మీరు పెళ్లి చేసుకునే వ‌ర‌కూ ఎవ‌రూ ప్ర‌శాంతంగా ఉండ‌రు. ఉండేలా లేరు` అంటూ పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి.

శిఖ‌ర్ ప‌హారియా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తి కాదు. అత‌నొక ప్రొపెష‌న‌ల్ బిజినెస్ మ్యాన్. ముంబైకి చెందిన వ్యాపార వేత్తలు సంజయ్ పహారియా మరియు స్మ్రుతి షిండే దంపతులకు జన్మించారు. శిఖర్ తాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News