జాన్వీ లుక్: కళాత్మక కాన్వాస్‌లో సజీవంగా చెక్కిన శిల్పం
ప్రకృతి కళాత్మక కాన్వాస్‌లో సజీవంగా చెక్కిన శిల్పంలా కనిపిస్తోంది. తాజా ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
జరీ అంచు కాటన్ చీర.. తలలో తురిమిన అందమైన పూలు.. సూటిగా గుచ్చేసే చక్రల్లాంటి కళ్లు.. పింక్ పెదవులు.. చూడగానే స్టన్నయిపోవాల్సిందే. పాతకాలపు ఆరెంజ్ కాటన్ చీరను ధరించి .. అరవిరిసిన ఆ కురులు.. టాప్ లెస్ లుక్ తో గుబులు రేపుతోంది ఈ బ్యూటీ. సూటిగా గుచ్చేస్తున్న ఆ అందమైన కళ్లు కుర్రకారుకు కంటిమీద కునుకు పట్టనీకుండా చేయడం ఖాయం.
మరో కోణంలో చూస్తే వనంలో సీతలా జాన్వీ ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో జాన్వీ కపూర్ ఎప్పుడూ ఇంత సింపుల్ గా కనిపించలేదు. నిరంతరం బికినీలు.. స్విమ్ సూట్లు.. క్యాట్ వాక్ సాంప్రదాయానికి సింబాలిక్ గా కనిపించేది. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన రూపంతో ఆకట్టుకుంది. ప్రకృతి కళాత్మక కాన్వాస్‌లో సజీవంగా చెక్కిన శిల్పంలా కనిపిస్తోంది. తాజా ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ఓవైపు వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూనే, ఇప్పుడు టాలీవుడ్ పైనా దృష్టి సారించింది. తెలుగులో ఆరంగేట్రమే యంగ్ యమ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ అరుదైన అవకాశం అందుకుంది. తారక్ తో తొలి అవకాశానికి జాన్వీ చాలా మురిసిపోయింది. నటిగా ఇప్పటికే నిరూపించుకున్న ఈ బ్యూటీ తారక్ తో కలిసి ఎనర్జిటిక్ డ్యాన్సులు చేయడంలో నిరూపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదీ అంత సులువేమీ కాదు. యంగ్ టైగర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. తదుపరి పాన్ వరల్డ్ పైనే గురి పెట్టాడు. ఇలాంటి సమయంలో జాన్వీ కోసం కొరటాల శివ అదిరిపోయే పాత్రను క్రియేట్ చేసి ఉంటాడని అంతా ఊహిస్తున్నారు. సిసలైన రాఖీ పండగ గిఫ్ట్ ని అందించిన జాన్వీకి శుభాకాంక్షలు చెబుతూ...!