నన్ను కావాలనే ఇరికించారు..న్యాయ పోరాటం చేస్తా! జానీ మాస్టర్
నార్సింగి పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని పోలీసులు విచారించి ఉప్పరపల్లి కోర్టుకు తరలించడం..కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం...అక్కడ నుంచి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో భాగంగా జానీ తన వెర్షన్ చెప్పినట్లు తెలుస్తోంది. `నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు. కావాలనే కొందరు నాపై ఫిర్యాదు చేయించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటకు వస్తాను` అని అన్నాడు.
నార్సింగి పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితురాలి ఇంట్లోనే విచారించిన పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. `జానీ మాస్టర్ నాపై అత్యాచారం చేసి దాడి చేశాడు. షూటింగ్ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడు. కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడు. తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడు.
పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఈ స్టేట్ మెంట్ ఆధారంగానే పోలీసులు విచారించి న్యాయస్థానంలో హాజరు పరిచారు. పోలీసులు కోర్టుకు ఇవ్వాల్సిన సమాచారం అంతా ఇచ్చినట్లు తెలుస్తోంది. 14 రోజుల రిమాండ్ అనంతరం జానీని మళ్లీ కోర్టులో హాజరు పరచనున్నారు.
అటు జానీ భార్య కూడా తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని...తప్పు చేసాడని తెలిస్తే వదిలేస్తానని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన అనంతరం ఆమె అక్కడ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.