జవాన్ బుకింగ్స్ .. పఠాన్ రికార్డ్ బ్రేక్ అయ్యేటట్టుందిగా
యూఏఈ, యూఎస్ ఏ, యూకే, ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి.
ఇండియన్ సినిమాల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ ఒకటి. ఈ సినిమా కోసం షారుక్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్ గా ఓవర్సీస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు అయిన బుకింగ్స్ వివరాలు బయటకు వచ్చాయి. అవి షాకింగ్ అండ్ సర్ ప్రైజింగ్ రేంజ్ లో ఉన్నాయి.
ఈ చిత్రం షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా రాబోతుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలోనే విడుదల చేయబోతున్నారు. వరల్డ్ వైడ్ గా కూడా థియేటరల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే దర్శకుడు అట్లీకి సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
అలాగే షారుక్ వరల్డ్ వైడ్ గా పాపులారిటీ ఉంది. అందుకే అన్ని భాషలకు సంబంధించిన అప్డేట్స్ అందరికి కనెక్ట్ అయ్యేలా గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.
సినిమాలో యాక్షన్, రొమాన్స్ రెండిటి బ్యాలెన్స్ చేస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే విడుదల చేసిన టీజర్, గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. గ్లింప్స్ మొత్తాన్ని పవర్ ఫుల్ యాక్షన్ తో కట్ చేయగా.. రీసెంట్ గా రిలీజైన చలేయా సాంగ్ లో మంచి రొమాన్స్ కెమిస్ట్రీని చూపించారు. ఇవి షారుక్ ఫ్యాన్స్ తో పాటు మిగిత ఆడియెన్స్ కు బాగానే ఆకట్టుకున్నాయి.
అయితే ఇక ఈ చిత్ర రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న మూవీ రిలీజ్ కానుంది. దీంతో ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. యూఏఈ, యూఎస్ ఏ, యూకే, ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి.అయితే యూఎస్ ఏ బుకింగ్స్ కు సంబంధించిన వివరాలు వచ్చాయి.
ఈ చిత్రం యూఎస్ ఏలో 289లొకేషన్స్ లో విడుదల కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే 4800టికెట్లు అమ్ముడుపోయాయట. 74.2కె డాలర్లు వచ్చాయట. అంటే సినిమా రిలీజ్ టైమ్ కు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంతకుముందు ఓవర్సీస్ లో పఠాన్ కు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నార్త్ అమెరికాలో 1.85 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే జవాన్ రిలీజ్ కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. పఠాన్ మార్క్ ను అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పఠాన్ ఓపెనింగ్ డేన రూ.37కోట్లు వసూలు చేయగా.. జవాన్ రూ.50కోట్ల వరకు సాధిస్తుందని అక్కడి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాలోనూ భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.