జవాన్.. రెండో రోజూ అదే జోరు..
కాబట్టి ఈ వీకెండ్లో జవాన్ హిందీ వెర్షన్ మొత్తంగా రూ.230కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొత్త సినిమా జవాన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మొదటి రోజు హిందీ వెర్షన్లో రూ.65కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. రెండో రోజు కూడా అదే రేంజ్లో వసూళ్లను అందుకుంది. హిందీలో రూ.46కోట్ల నెట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది.
సాధారాణంగా బాలీవుడ్ సినిమాలకు తొలి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లు వస్తాయి. కానీ జవాన్‌కు అలా రాలేదు. ఎందుకంటే రెండో రోజు వర్కింగ్ డే కారణంగా నార్మల్ డ్రాప్ అయింది. అయినప్పటికీ మూడో(శనివారం), నాలుగో రోజు(ఆదివారం) కోసం భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కాబట్టి ఈ వీకెండ్లో జవాన్ హిందీ వెర్షన్ మొత్తంగా రూ.230కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇకపోతే ఓవర్సీస్ విషయానికొస్తే.. పఠాన్ సినిమా లాంగ్ రన్ టైమ్‌లో దాదాపు రూ.400కోట్ల వరకు వసూలు చేసింది. జవాన్ సినిమా ఇప్పటి వరకు రెండు రోజుల్లో 10 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.83కోట్ల వరకు అందుకుంది. చూడాలి మరి ఓవర్సీస్లో పఠాన్ రికార్డులను జవాన్ బ్రేక్ చేస్తుందో లేదో.
మొత్తంగా ఈ చిత్రానికి ఇప్పటివరకు రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.230కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో షారుక్ గత చిత్రం పఠాన్‌ను మించిన జవాన్ భారీ స్థాయిలో ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ వీకెండ్ వసూళ్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా మొత్తం రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే వచ్చే వారం కూడా ఎలాగో పెద్ద సినిమాలు రిలీజ్లు లేవు కాబట్టి.. ఈ చిత్రం రూ.1000కోట్ల గ్రాస్ వసూళ్లు ఖాయమని అంటున్నారు. చూడాలి మరి కింగ్ ఖాన్ ఈ చిత్రంతోనూ మరో వెయ్యి కోట్లను కొల్లగొడతారో లేదో.
ఇకపోతే ఈ చిత్రంతో నయనతార, విజయ్ సేతుపతి, దీపిక పదుకొణె, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సాన్య మల్హోత్ర, యోగిబాబు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. రుబెన్ ఎడిటర్‌గా వ్యవహరించారు. గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ నిర్మాతలుగా వ్యవహరించారు. రమణ గిరివసన్ స్క్రీన్‌ప్లే కథ అందించారు.