జపాన్ లో ఆర్ఆర్ఆర్ దూకుడు.. కలెక్షన్ల సునామీ..

జపాన్ లో ఈ చిత్రం ఇప్పటికే 305 రోజుల నుంచి ప్రదర్శితమవుతోందట. ఇప్పుడు ఏకంగా రూ.144కోట్ల వసూళ్లను అందుకుందట.

Update: 2023-08-23 13:04 GMT

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్లా విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెకన్స్ సునామీ సృష్టించింది. అలా ఈ చిత్రం జపాన్ లో కూడా దుమ్మురేపిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కడి బాక్సాఫీస్ ముందు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిందీ చిత్రం. ఈ చిత్రం విడుదలైన ప్రతిచోట సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు థియేటర్ల వద్ద క్యూలు కట్టారు. హాలీవుడ్ స్టార్ దర్శకుడు, నటులు కూడా ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో జక్కన్నతో పాటు చరణ్, తారక్ కు గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ వచ్చింది.

ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ముందు దాదాపు రూ.1000కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఎన్నో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకుంది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును కూడా ముద్దాడింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ఈ అవార్డు వరించింది.

అయితే ఇప్పుడిప్పుడే ఈ సినిమా గురించి ఇక్కడి సినీ ప్రియులు కాస్త ఆలోచించడం తగ్గించారు. కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక చోట ప్రదర్శితమవుతూనే ఉంది. ఈ క్రమంలోనే జపాన్ లోనూ ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. అలా అక్కడ సరికొత్త రికార్డులను సాధిస్తూనే ఉంది. ఇప్పటికే ముత్తు, సాహో, బాహుబలి 2 వంటి పలు ఇండియన్ బాక్సాఫీస్ హిట్‌లను వెనక్కి నెట్టింది. ఇప్పుడు మరో ఘనతను అందుకుంది.

జపాన్ లో ఈ చిత్రం ఇప్పటికే 305 రోజుల నుంచి ప్రదర్శితమవుతోందట. ఇప్పుడు ఏకంగా రూ.144కోట్ల వసూళ్లను అందుకుందట. ఈ విషయాన్ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా పేరు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీని గురించి ప్రస్తుతం కథనాలు వస్తున్నాయి.ఇక ఈ చిత్ర సీక్వెల్ గురించి కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ సినిమాను జక్కన్న కుమారుడు కార్తికేయ హ్యాండిల్ చేసే అవకాశముందని అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Tags:    

Similar News