బాహుబలి కలెక్షన్స్ ని ఛాలెంజ్ చేస్తోన్న జవాన్

అయితే జవాన్ సినిమా పఠాన్ మూవీ రికార్డ్ ని మాత్రం బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Update: 2023-09-12 04:06 GMT

ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో మొదటి స్థానంలో బాహుబలి 2 నిలుస్తుంది. దంగల్ రెండు వేల కోట్లకి పైగా కలెక్ట్ చేసిన వాటిలో మెజారిటీ షేర్ చైనా మార్కెట్ నుంచి వచ్చిందే. ఇండియాలో పెద్దగా కలెక్ట్ చేయలేదు. ఒక్క హిందీలోనే బాహుబలి 2 ఏకంగా 725 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీనిని పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ అందుకోవాలని ట్రై చేశారు.

అయితే మూవీ ఫైనల్ గా 640 కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోయింది. రీసెంట్ గా గద్దర్ 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. అయితే ఈ మూవీ కూడా నెట్ కలెక్షన్స్ పరంగా బాహుబలి 2ని బీట్ చేసింది. కానీ గ్రాస్ పరంగా మాత్రం అందుకోలేదు. బాహుబలి 2ని బ్రేక్ చేసి హిందీ సినిమా స్టామినాని చూపించాలని అక్కడ దర్శక, నిర్మాతలు, హీరోలు చూస్తున్నారు.

అయితే గ్రాస్ కలెక్షన్స్ పరంగా బాహుబలి 2ని బ్రేక్ చేయడం అంత తేలికైన విషయం కాదు. షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో చేసిన జవాన్ మూవీ ఇప్పటికే గ్రాస్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లు దాటిపోయింది. అయితే హిందీ బెల్ట్ లో కలెక్షన్స్ చూసుకుంటే నాలుగు రోజుల్లో 252 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. బాహుబలి 2ని బ్రేక్ చేయాలంటే ఇంకా 600 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ మొత్తం అందుకోవడం అంత ఈజీ అయితే కాదు. నిలకడగా భారీ కలెక్షన్స్ ని రాబడుతూ కనీసం రెండు వారాలు కొనసాగాలి. అప్పుడే బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. అయితే జవాన్ సినిమా పఠాన్ మూవీ రికార్డ్ ని మాత్రం బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

లాంగ్ రన్ లో షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా జవాన్ నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే 600 కోట్లు సమీపించిన నేపథ్యంలో మరో వారం రోజుల్లో వెయ్యి కోట్ల మార్క్ ని అందుకుంటుందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News