15కోట్ల బడ్జెట్ 1000 మంది డ్యాన్సర్లతో పాట చిత్రీకరణ
చెన్నై- హైదరాబాద్ సహా వివిధ భారతీయ నగరాల నుండి 1000 మంది నృత్యకారులు ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు.
'పఠాన్' ఘనవిజయం తర్వాత షారూఖ్ ఖాన్ చిత్రం 'జవాన్' మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పిలుపందుకుంటోంది. ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవాల ని కింగ్ ఖాన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. జవాన్ ని తన కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంగా ప్రకటించి తెలుగు-తమిళం సహా దక్షిణాది భాషల్లో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఖాన్ జీ. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని వైవిధ్యంగా ప్లాన్ చేసారు. ఇప్పుడు జవాన్ నుంచి మొదటి పాట 'జిందా బండా..' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది వీక్షకులకు విజువల్ ట్రీట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ పాట లో షారుఖ్ ఖాన్ (SRK) స్వరకర్త అనిరుధ్ ట్యూన్ కి తగ్గట్టుగా వందలాది మంది అమ్మాయిల తో కలిసి నృత్యం చేస్తారని తెలుస్తోంది. శోబి నృత్య దర్శకత్వం వహించిన ఈ పాట ఐదు రోజుల పాటు చెన్నైలో భారీ స్థాయిలో చిత్రీకరించారు. చెన్నై- హైదరాబాద్ సహా వివిధ భారతీయ నగరాల నుండి 1000 మంది నృత్యకారులు ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. 15 కోట్ల భారీ బడ్జెట్ తో చిత్రీకరించారన్నది మరో ఆసక్తికరమైన అప్ డేట్.
ఒక సన్నిహిత సోర్స్ ప్రకారం ''జవాన్ ట్రాక్ ని చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, మధురై, ముంబయి వంటి భారతీయ నగరాల నుండి 1000 మందికి పైగా డ్యాన్సర్లను ఎంపిక చేసుకుని ఐదు రోజుల పాటు చెన్నైలో భారీ స్థాయిలో చిత్రీకరించారని తెలిసింది. ఈ పాట ఒక భారీ వేడుక నేపథ్యంలో విజువల్ ఫీస్ట్ గా ఉంటుంది. 15 కోట్లకు పైగా బడ్జెట్ ని వెచ్చించి చిత్రీకరించిన జిందా బందా వేలాది మంది అమ్మాయిలతో SRK డ్యాన్స్ చేయడం ఒక అద్భుతమైన దృశ్యంగా కనిపించనుంది. అనిరుధ్ ట్యూన్.. శోబి కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన అస్సెట్ కానున్నాయి.
స్టంట్స్ నభూతోనభవిష్యతి:
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా, వీనం, స్టార్ ట్రెక్ , టీనేజ్ మ్యూటెంట్: నింజా టార్టాయిస్ వంటి బ్లాక్‌బస్టర్ యాక్షన్ చిత్రాలకు స్టంట్స్ అందించిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్పిరో రజాటోస్ 'జవాన్'కి ఫైట్స్ ని సమకూర్చారు. మల్టీ-టాలెంటెడ్ స్టంట్‌మ్యాన్, స్టంట్ కోఆర్డినేటర్ కం డైరెక్టర్‌గా స్పిరో విన్యాసాలు జవాన్ కి ప్రధాన అస్సెట్ కానున్నాయి. బాడ్ బాయ్స్ II (2004) సహాయ స్టంట్ కొరియోగ్రాఫర్ గాను అతడు పని చేసాడు.
ఉత్తమ స్టంట్ కోఆర్డినేషన్ కు టారస్ అవార్డు .. మూడు స్టంట్‌మ్యాన్ అవార్డులు సహా ప్రశంసలు దక్కాయి. స్పిరో రజాటోస్ చేరికతో జవాన్ థ్రిల్లింగ్ హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాల స్థాయి అమాంతం మారిపోయింది. ఈ చిత్రం లో స్టంట్స్ నిస్సందేహంగా ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయన్న ప్రచారం సాగుతోంది. యాక్షన్-ప్యాక్డ్ సినిమా కళ్లు తిప్పుకోనివ్వదని అభిమానులు భావిస్తున్నారు.
జవాన్ ఒక పాన్-ఇండియన్ ఎంటర్ టైనర్. ఇందులో షారూఖ్ , నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించగా.. దీపికా పదుకొనే ప్రత్యేక పాత్రలో నటించింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి పాపులర్ స్టార్లు సహా అసాధారణమైన తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది. విజయవంతమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్న అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో గౌరీ ఖాన్ నిర్మించారు. గౌరవ్ వర్మ ఈ చిత్రానికి సహనిర్మాత. 7 సెప్టెంబర్ 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి పాట జిందా బందా ప్రేక్షకుల కు బిగ్ సర్ ప్రైజ్ ని ఇవ్వనుందని చెబుతున్నారు. ఇస్తుంది.