జయలలిత జీవితంలో ప్రేమ పెళ్లి ఓ భయానకం!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయలలిత వ్యక్తిగత విషయాలు షేరు చేసుకున్నారు. ఆ వేంటో ఆమె మాటల్లోనే...
ఒకప్పుడు కుర్రకారుని ఊపేసిన జయలలిత అలియాస్ బోరింగ్ పాప గా ఆమె ఎంత పాపులర్ అయ్యారో తెలిసిందే. ఎన్నో వ్యాంప్ పాత్రలతో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. మాలీవుడ్ లోనూ ఆమె ఎంతో ఫేమస్. తెలుగు నటి అయినా అక్కడ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే నటిగా ఆమె ప్రయాణం సాఫీగా సాగినా ధాంపత్య జీవితం మాత్రం చేదు అనుభవాల్నే మిగిల్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయలలిత వ్యక్తిగత విషయాలు షేరు చేసుకున్నారు. ఆ వేంటో ఆమె మాటల్లోనే...
'నామీద ఆధారపడ్డ కుటుంబం కోసం ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలనే ఉద్దేశంతోనే వ్యాంప్ పాత్రలకు సైన్ చేసేదాన్ని. కానీ ఇలా చేయడంలో వల్ల నాలో క్లాసికల్ డాన్సర్ కి దూరమవ్వాల్సి వచ్చింది. అలాగే జయలలిత పేరు కూడా నాకు తమిళనాడులో చాలా ఇబ్బందులే తెచ్చిపెట్టింది. ఆ పేరు పెట్టుకున్నానని ఆ పార్టీ వాళ్లు ఇంటి మీద రాళ్లు రువ్వేవారు. పేరు మార్చుకున్నాక అక్కడ అవకాశాలు తగ్గాయి.
మలయాళ డైరెక్టర్ వినోద్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. డేట్స్ విషయంలో పెద్ద గొడవ జరిగితే అతను ముందుడి పరిష్కరించాడు. ఆ చిన్న దానికే అతనితో లవ్ లో పడిపోయాను. అతను కోసం ఎన్ని అవకాశాలు వదులుకున్నానో చలపతిరావు..పరుచూరి గోపాలకృష్ణకి తెలుసు. తొందరపడుతున్నావని వాళ్లు చెప్పేవారు. కానీ అప్పటికే అతను రక్తంతో ఉత్తరం రాయడం..చస్తానని బెదిరించడంతో గుడిలో పెళ్లి చేసుకున్నాను.
అదే నేను చేసిన తప్పు. ఆ మరుసటి రోజు నుంచి ఆస్తి కోసం తగాదా పడేవాడు. లేదంటే పిల్లల్ని కనమని వేధించేవాడు. డబ్బు తీసుకురాకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు. ఇలా సాగిన జీవితం లాభం లేదని ఆరు నెలలకే విడిపోయాను. ఇటీవలే అతను ప్రమాదంలో గాయపడి పక్షవాతం బారిన పడ్డాను. అతని భార్య సరిగ్గా చూసుకోలేదని మందుల కోసం ఐదు వేలు పంపించాను. ఆ మధ్యనే నాలుగు కోట్ల రూపాయలు పొగొట్టుకున్నాను.
రాఘవేంద్రరావు వద్ద పనిచేసే అనీల్ గణపతి రాజు నా దగ్గరకు వచ్చి అమ్మ అమ్మ అని డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడు. ఇలా ఆర్దికంగా బాగా నష్టపోయాను. ఇండస్ట్రీ నుంచి ఇప్పుడెవరు సహకారం కూడా అందించడం లేదని ఏమోషనల్ అయ్యారు.