అలనాటి మేటి తార మొదటి రమ్యునరేషన్ ఎంతో తెలుసా?

అయితే ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు ఎందరో ఉన్నారు.

Update: 2024-09-24 11:30 GMT

ట్రెండు మారుతున్న కొద్దీ సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్లకు ఉన్న ప్రాముఖ్యత ఇప్పుడు చిత్రాలలో పెద్దగా లేదు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో తప్ప హీరోలను హైలెట్ చేసే సినిమాలలో హీరోయిన్ల పాత్ర చాలా తక్కువగానే ఉంటుంది. అది కూడా చాలా వరకు గ్లామర్ కే పరిమితం అవుతుంది. అయితే ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు ఎందరో ఉన్నారు.

అలాంటి వారిలో హీరోయిన్ జయప్రద ఒక్కరు. కేవలం సౌత్ సినిమాలకే పరిమితం కాకుండా నార్త్ లో కూడా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు జయప్రద. 14 సంవత్సరాల వయసులో హీరోయిన్గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె వరుస హిట్లు అందుకొని అగ్రతారగా మెలిగారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించారు. అందమైన చీరకట్టు.. అదిరిపోయే హావభావాలు.. అద్భుతమైన నటన అన్ని కలగలిపిన రూపం జయప్రద.

తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో కూడా తన సత్తా చాటుకున్నారు. సినీ రంగంలో ప్రేక్షకులను మెప్పించిన జయప్రద రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. స్కూల్లో ఓ డాన్స్ కాంపిటీషన్లో పాటిస్పేట్ చేసిన జయప్రద అభినయం నచ్చడంతో ఎం ప్రభాకర్ రెడ్డి ఆమెను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 1976లో విడుదలైన భూమి కోసం అనే మూవీలో జయప్రద ఓ మూడు నిమిషాల నీడివి కలిగే చిన్న పాత్రలో కనిపించారు.

అలా మూడు నిమిషాల పాత్రలో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మూడు దశాబ్దాల పాటు చక్రం తిప్పింది జయప్రద. తన మొదటి పాత్రకు కేవలం 10 రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న జయప్రద అనంతరం భారతదేశంలోనే అత్యధిక పారితోషకం అందుకునే హీరోయిన్గా ఎదిగారు.

మొదటినుంచి జయప్రదకు నాట్యం అంటే ఎంతో ఇష్టం. అలాగే డాక్టర్ చదవాలి అని ఆమె ఎంతో ఆశపడ్డారు. అయితే డాక్టర్ కావాలి అనుకున్న జయప్రద ఫైనల్ గా యాక్టర్ గా మారిపోయారు.

Tags:    

Similar News