సినీ జర్నలిజంపై హీరో సంచలన వ్యాఖ్యలు!
'వేదా' సినిమా ప్రచారంలో భాగంగా జాన్ అబ్రహం ఓ మీడియా జర్నలిస్ట్ పై మండిపడిన సంగతి తెలిసిందే
'వేదా' సినిమా ప్రచారంలో భాగంగా జాన్ అబ్రహం ఓ మీడియా జర్నలిస్ట్ పై మండిపడిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ కూల్ గా కనిపించే జాన్ ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడ యుద్ద వాతావరణమే అలుముకుంది. ఒక్క క్షణం పాటు ఏం జరుగుతోందా? అర్దం కాని సన్నివేశం ఎదురైంది. అయితే తాజాగా ఈ ఘటనపై జాన్ అబ్రహం స్పందించాడు. 'నన్ను రెచ్చగొట్టడానికి, ఇబ్బంది పెట్టడానికే అతడు వచ్చాడు.
అతను అడిగినప్రశ్నకు నాకు కోపం తన్నుకుని వచ్చింది. ఆ సమయంలో కోపాన్ని నియంత్రించు కోలేకపోయా. కేకలు వేశాను. కాబట్టి అతడు గెలిచాడు. నేను ఓడిపోయాను. మీడియా సమావేశంలో పాల్గొని చాలా కాలమైంది. ట్రైలర్ రిలీజ్ లు లాంటివి నచ్చవు. ఎందుకంటే మనం ఇంకా 20 ఏళ్లు వెనుకబడే ఉన్నా. అదే జర్నలిస్టుల, అవే ప్రశ్నలు, ఎవరు తెలివైన, సరైన ప్రశ్నలు అడగరు. నా దృష్టిలో ఎంటర్ టైన్ మెంట్ జర్నలిజం అనేది భారతదేశంలో ముగిసిన అంశం' అని అన్నారు.
దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు కూడా సినీ జర్నలిస్టులో ఆగ్రహాన్ని తెప్పించేలా ఉన్నాయి. సినిమా జర్నలిజం గురించి జాన్ అబ్రహం కించ పరిచినట్లు మాట్లాడినట్లు ఉందని ఓ నెటి జనుడు అభిప్రాయపడ్డాడు. అతడి దృష్టిలో సినిమా జర్నలిజం భారతదేశంలో అవసరం లేదన్నట్లే ఉందని తెలుస్తోంది. కొంత మంది జాతీయ మీడియా జర్నలిస్టులు జాన్ వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.
'వేదా' ట్రైలర్ సాక్ష్యంగానే ఓ పాత్రికేయుడు జాన్ అబ్రహంని కడిగేసే ప్రయత్నంచేసాడు. ఎప్పుడు ఒకే తరహా యాక్షన్ సినిమాలు చేస్తారు? కొత్తగా ఎందుకు ట్రై చేయడం లేదు? అని అందరి ముందు జాన్ ని అడిగేసాడు. దీంతో జాన్ అబ్రహం ఫీలయ్యాడు. 'ఇదొక చెత్త సినిమా అని నేను అనొచ్చా? మీరు మా సినిమా చూసారా? చూసిన తర్వాత మాట్లాడండి. ఈ సినిమా చాలా భిన్నమైన కథాంశంతో తెరకెక్కింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. నా నటన ఇంటెన్స్ గా ఉటుంది. మీరింకా సినిమా చూడలేదు. కాబట్టి చూసిన తర్వాత మాట్లాడండి అని బిగ్గరగా' అరిచిన సంగతి తెలిసిందే.