టాలీవుడ్ లో జానీలీవర్ డాటర్
జానీ లీవర్ ఇండస్ట్రీకి వెళ్లక ముందు..వెళ్లిన తర్వాత ఎన్నో కష్టనష్టాలు చూసి ఎదిగిన నటుడాయన
బాలీవుడ్ స్టార్ కమెడియన్ జానీ లివర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు నుంచి హిందీ పరిశ్రమకు వెళ్లి పెద్ద స్టార్ కమెడియన్ గా ఎదిగిన లీవర్ జర్నీ ఎంతో ఆసక్తికరమైనది. జానీ లీవర్ స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి. అసలు పేరు జాన్ రావు కాగా జానీ లీవర్ తండ్రి కుటుంబ పోషణ కోసం ముంబైలోని హిందుస్తాన్ లీవర్ కంపెనీలో ఉద్యోగం చేరడం..అదే కంపెనీలోని లీవర్ జానీ తర పేరు పక్కన పెట్టుకోవ డంతో జానీ లీవర్ అయ్యారు.
జానీ లీవర్ ఇండస్ట్రీకి వెళ్లక ముందు..వెళ్లిన తర్వాత ఎన్నో కష్టనష్టాలు చూసి ఎదిగిన నటుడాయన. అయితే హిందీ లో అంత పెద్ద పేరు తెచ్చుకున్నా టాలీవుడ్ లో మాత్రం ఆయన సినిమాలు ఇంతవరకూ చేసింది లేదు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతల్ని జానీ లీవర్ కుమార్తె తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్ప టికే కుమార్తె జామీ లీవర్ హిందీలో సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.
'ఆ ఒక్కటి అడక్కు' అనే సినిమాతో అమ్మడు తెలుగులో లాంచ్ అవుతుంది. ఈ చిత్రాన్ని 'చోటా భీమ్' నిర్మాత రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. రామ్ అంకం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ అవకాశం పట్ల ఆమె ఎంతో ఎగ్జైట్ మెంట్ కి గురైంది. ఈ సందర్భంగా మాతృ భాష తెలుగులో సినిమా చేయడం సంతోషంగా ఉందని అంది. ఈ సందర్భంగా తన నాయనమ్మకి హృదయపూర్వక నివాళి అర్పించింది.
తెలుగు సినిమా చేయడం ఎప్పటి నుంచో కలగా ఉందని..ఇప్పుడా డ్రీమ్ నెరవేరుతుందని..వ్యక్తిగతంగా ఈ సినిమా కథలో తన కుటుబ మూలాలు కూడా కనిపిస్తాయని చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా తర్వాత స్టార్ కమెడీయన్ డాటర్ కి ఎలాంటి అవకాశాలు వస్తాయన్నది చూడాలి. బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ పుల్ చిత్రాల్లోనే భాగమైంది. ' హౌస్ ఫుల్-4'..'బూత్ పోలీస్' లాంటి చిత్రాలు అమ్మడికి అక్కడ మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.