బిగ్ బాస్ నవీన్ స్టోరీకి ఆ స్టార్ హీరో ఫిదా!
అంటే ఆయన నాకు టైమ్ ఇవ్వడమే ఎక్కువ. ఫేస్ టు ఫేస్ కూర్చుని కథ చెప్పా. 'హే అభయ్ డైరెక్షన్ లో ఎప్పుడు వచ్చావ్' అని తారక్ అడిగారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు మూవీలో ఫ్రెండ్ పాత్రలో నటించిన అభయ్ నవీన్.. రీసెంట్ గా తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యాక్టర్ అవ్వాలనే కోరికతో బ్యాంక్ జాబ్ వదిలేసిన ఆయన.. బొమ్మల రామారం మూవీతో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాలో ప్రియదర్శితో కలిసి కడుపుబ్బా నవ్వించారు. అలా పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ రోల్స్ లో నటించారు.
రీసెంట్ గా రామన్న యూత్ మూవీతో హీరోగా మారారు అభయ్ నవీన్. యాక్ట్ చేయడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఆ మూవీకి ఓటీటీలో కూడా ఆదరణ బాగానే వచ్చింది. నవీన్ యాక్టింగ్, డైరెక్టన్ కు ప్రశంసలు వచ్చాయి. అయితే ఆ సినిమా విషయంలో తనకు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో మంచి అనుభవం ఉందని నవీన్ బిగ్ బాస్ కు వెళ్లేముందు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
"జూనియర్ ఎన్టీఆర్ గారితో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. రామన్న కథ చెబుతామని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లా. అరగంటలో పూర్తి చేద్దామనుకున్నా. అంటే ఆయన నాకు టైమ్ ఇవ్వడమే ఎక్కువ. ఫేస్ టు ఫేస్ కూర్చుని కథ చెప్పా. 'హే అభయ్ డైరెక్షన్ లో ఎప్పుడు వచ్చావ్' అని తారక్ అడిగారు. టైమ్ ఉండదు.. డిస్ట్రబ్ చేయడం ఎందుకని అరగంటలో స్టోరీ అంతా చెబుదామనుకున్నా. నేను స్టార్ట్ చేస్తే ఆపను. అలా రెండు గంటలపాటు చెప్పా" అని నవీన్ పేర్కొన్నారు.
"అలా జూనియర్ ఎన్టీఆర్ కూర్చుని మొత్తం కథ అంతా విన్నారు. నాకు 24 గంటలు టైమ్ ఇవ్వు. నీకు చెప్తా అన్నారు. నేను ఆయనకు కథ చెప్పడమే ఎక్కువ. 24 గంటల తర్వాత నాకు కాల్ వచ్చింది. నేను ఎవరు ద్వారా వెళ్లానో వారికి తారక్ అన్న కాల్ చేశారు. 'స్టోరీ మొత్తం ఆలోచించా. వెంటనే చెబితే వేరేలా ఉంటుంది. వన్ డే వరకు నాకు స్టోరీ గుర్తుంటే అందులో పస ఉన్నట్లు. అందుకే ఒకరోజు టైమ్ అడిగాను'ని తారక్ ఆయనతో చెప్పారు" అని నవీన్ తెలిపారు.
"ఆ తర్వాత స్టోరీ అంతటిని ఎన్టీఆర్ అన్న గుర్తు చేసుకున్నారు. నాలుగైదు పాయింట్లు చెప్పారు. వాటి మీద వర్క్ చేయమన్నారు. కథ చాలా మంచిగా ఉందని తారక్ చెప్పారు" అని అభయ్ నవీన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన యూట్యూబ్ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. సూపర్ ఛాన్స్ కొట్టేశావ్ అన్న అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తారక్ కు స్టోరీ నచ్చిందంటే నీవు తోపు అని ఎన్టీఆర్ అభిమానులు పొగుడుతున్నారు.