సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌.. సినిమా ప్ర‌ద‌ర్శ‌న రీజ‌నేంటి?

అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు తొలిసారిగా దర్శకత్వం వహించిన `లాపాట లేడీస్‌` విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ గ్రాస‌ర్ గా నిలిచింది.

Update: 2024-08-09 09:18 GMT

అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు తొలిసారిగా దర్శకత్వం వహించిన `లాపాట లేడీస్‌` విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ గ్రాస‌ర్ గా నిలిచింది. దాదాపు 50కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 40కోట్లు సుమారుగా వ‌సూలు చేసింది. అయితే ఈ సినిమాలో లింగ స‌మాన‌త్వం అనే టాపిక్ ప్ర‌జ‌ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షించింది. అంతేకాదు.. ఇది కోర్టు న్యాయ‌మూర్తుల‌ను ఆక‌ర్షంచ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 9న సుప్రీంకోర్టులో చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్ కోసం ప్రీమియర్ చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

CJI (సుప్రీం న్యాయ‌మూర్తి) ఏడాది పొడవునా జరిగే లింగ సున్నితత్వ కార్యక్రమంలో భాగంగా ఒక ఈవెంట్ ని నిర్వ‌హిస్తుంది. ఈ వేడుక‌లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే వారి లక్ష్యం. ఈ సంద‌ర్భంగా లాపాటా లేడీస్ ప్రీమియ‌ర్ వీక్షించేందుకు సుప్రీం న్యాయ‌మూర్తులు ప్ర‌య‌త్నించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఈ స్క్రీనింగ్ అనేది సుప్రీం కోర్టు సిబ్బందికి అవగాహన కల్పించడానికి CJI తీసుకున్న చొరవ. సిబ్బంది కోసం 24/7 ఆయుర్వేద క్లినిక్ వంటి అనేక కోర్టు కార్యక్రమాలు ప్రచారంలో లేవని న్యాయ‌మూర్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సిబ్బంది మధ్య స్నేహాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది.

నేటి సాయంత్రం లాపాటా లేడీస్ ప్రీమియ‌ర్‌కి న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, రిజిస్ట్రీ సిబ్బంది హాజరవుతారు. ఉన్నత న్యాయస్థానం పరిపాలనా భవన సముదాయంలోని ఆడిటోరియంలో లాపాటా లేడీస్ ప్రీమియ‌ర్ నిర్వ‌హించ‌నుండ‌గా.. అమీర్ ఖాన్, కిర‌ణ్ రావు హాజ‌రుకానున్నారు. స్క్రీనింగ్ అనంతరం నిర్మాత అమీర్ ఖాన్, దర్శకురాలు కిరణ్ రావు ప్రేక్షకులతో ముచ్చటించనున్నారు. లాపాటా లేడీస్ స్క్రీనింగ్ ఆలోచ‌న ఎవ‌రిది? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి. తొలుత‌ CJI భార్య కల్పనా దాస్ , ఆమె సిబ్బంది సినిమా చూసిన తర్వాత ఈ సినిమాని స్క్రీనింగ్ చేయాల‌నే ఆలోచన వచ్చింది. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

సామాజిక సమస్యలపై న్యాయవ్యవస్థ నిబద్ధతను ఎత్తిచూపుతూ `లపాట లేడీస్` చిత్రాన్ని తెరకెక్కించారు. లింగ సమానత్వంపై దృష్టి సారించి తెర‌కెక్కించిన అరుదైన చిత్ర‌మిది.

Tags:    

Similar News