గుసగుస.. నటవారసులకు జీరో బజ్
కొంతమంది నటవారసురాళ్లు తెరకు పరిచయమైనా అభిమానులు ఆసక్తిని కనబరిచారు.
అగ్ర హీరో లేదా అగ్ర హీరోయిన్ కుటుంబం నుంచి నటవారసులు తెరుకు పరిచయం అవుతున్నారు! అంటే.. దానికి ఎంతో క్రేజ్ ఉంటుంది. మహేష్, చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి నటవారసులు బరిలో దిగినప్పుడు ఫ్యాన్స్ లో హంగామా ఎలా ఉందో చూసాం. కొంతమంది నటవారసురాళ్లు తెరకు పరిచయమైనా అభిమానులు ఆసక్తిని కనబరిచారు. కానీ ఇప్పుడు ఏమైందో కానీ.. అమీర్ ఖాన్ అంతటి పెద్ద స్టార్ కుమారుడు జునైద్ ఖాన్ నటించిన సినిమాకి .. శ్రీదేవి నటవారసురాలు ఖుషీ కపూర్ నటించిన సినిమాకి ఆశించినంత బజ్ లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
ఎక్కడ తేడా కొట్టిందో కానీ బుక్ మై షో సహా ఆన్ లైన్ టికెటింగ్ లో అస్సలు ఏమాత్రం హైప్ లేదు. పోటీ బరిలో పెద్ద సూపర్ స్టార్ల సినిమాలు కూడా ఏం లేవు. అయినా జునైద్ - ఖుషి కపూర్ జంటగా నటించిన లవ్ యాపా చిత్రానికి టికెట్ సేల్ ఆశించిన విధంగా లేకపోవడం నిరాశపరుస్తోంది. మరోవైపు హిమేష్ రేషమ్మియా నటించిన రెట్రో సినిమా- బాడ్ యాస్ రవికుమార్ కి అద్భుతమైన టికెట్ సేల్ కనిపిస్తోంది. రేషమ్మియాకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా అతడి కోసం జనం థియేటర్లకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.
అయితే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుటుంబం నుంచి హీరో వస్తున్నాడు! అంటే అంతగా బజ్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. లవ్ యాపా టీజర్లు, ట్రైలర్లు , పోస్టర్లు, పాటలతో హంగామా సృష్టించాలని ప్రయత్నించినా, అమీర్ ఖాన్ స్వయంగా బరిలో దిగి కేవ్ మేన్ అవతారం ఎత్తి వీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించినా కానీ లవ్ యాపాకు ఆన్ లైన్ టికెట్ సేల్ ఆశించినంతగా లేదు. లవ్ యాపా ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. పరిమిత థియేటర్లలో విడుదల చేస్తున్నా ఈ సినిమాని చూసేందుకు జనం కదిలి రావడం లేదు. దీనికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. లవ్ యాపా రిలీజైన కొన్ని రోజుల తర్వాత మొన్నటి మార్కో తరహాలో లేటుగా అయినా పుంజుకుంటుందేమో! చూడాలి. తమిళ బ్లాక్ బస్టర్ లవ్ టుడే కి రీమేక్ గా రూపొందించిన లవ్ యాపా డెబ్యూ స్టార్లను ఆదుకుంటుందా లేదా వేచి చూడాల్సిందే.