అమీర్ ఖాన్‌ వారసుడి ఆశలు మన భానుమతి మీదే!

ప్రస్తుతం ఈయన రెండు ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. అందులో ఒకటి 'ఏక్‌ దిన్‌' మూవీ ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

Update: 2025-01-01 05:34 GMT

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్‌ దాదాపు దశాబ్ద కాలంగా సక్సెస్‌ లేక ఢీలా పడ్డాడు. ఆయన ఈ ఏడాదిలో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. తెలుగు దర్శకుడితో అయినా లక్ మారుతుందా అని అమీర్ ఖాన్‌ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు చాలా కాలంగా నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు వెయిట్‌ చేసిన అమీర్ ఖాన్ తనయుడు జునైద్‌ ఖాన్‌ గత ఏడాది మహారాజ్ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. పైగా జునైద్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇలాంటి ప్రాజెక్ట్‌ను ఎలా చేశావని చాలా మంది అసహనం వ్యక్తం చేశారు.

తండ్రి హిట్‌ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే జునైద్‌ సైతం హీరోగా సెటిల్‌ కావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన రెండు ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. అందులో ఒకటి 'ఏక్‌ దిన్‌' మూవీ ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అమీర్‌ ఖాన్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాయి పల్లవి ఈ సినిమాలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. కనుక ఏక్‌ దిన్‌కి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతుంది.

గత ఏడాది సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన అమరన్ సినిమా విడుదల అయ్యింది. తమిళ్‌లో శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందిన ఆ సినిమా అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్‌ వర్షన్‌కి మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. దాంతో పాటు సాయి పల్లవి గురించి హిందీ ప్రేక్షకుల్లో చర్చ జరిగింది. అందరి అంచనాలు అందుకునే విధంగా సాయి పల్లవి మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఈమె ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న రణబీర్ కపూర్‌, నితేష్‌ తివారీ రామాయణ్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

సీత పాత్రలో రామాయణ్‌ సినిమాలో నటిస్తున్న కారణంగా సాయి పల్లవి ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా జాతీయ స్థాయిలో స్టార్‌డంతో దూసుకు పోతుంది. ఇలాంటి సమయంలో జునైద్‌ ఖాన్‌ ఏక్‌ దిన్‌ సినిమాలో సాయి పల్లవి నటించడం వల్ల సినిమాకు బజ్ క్రియేట్‌ కావడంతో పాటు, సినిమా యావరేజ్ టాక్‌ దక్కించుకున్నా భారీ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కనుక గత ఏడాది నిరాశ పరచిన జునైద్‌ ఖాన్‌ ఈ సంవత్సరం సాయి పల్లవిపై ఆశలు పెట్టుకుని ఏక్‌ దిన్‌ సినిమాను చేయబోతున్నాడు. ఏక్ దిన్‌ కంటే ముందు జునైద్‌ ఖాన్‌ నటించిన లవ్యాపా సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2025లో జునైద్‌కి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News