'జురాసిక్ పార్క్' మేక‌ర్ చేతిలో చ‌ర‌ణ్!

`ఆర్ ఆర్ ఆర్` విజ‌యం త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ గా వెలిగిపోతున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-18 07:08 GMT

`ఆర్ ఆర్ ఆర్` విజ‌యం త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ గా వెలిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఒక్క పాన్ ఇండియా చిత్రం చ‌ర‌ణ్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. దేశ విదేశాల్లో చ‌ర‌ణ్ క్రేజ్ అంత‌కంత‌కు రెట్టింపు అయింది. చైనా, జ‌పాన్ లాంటి దేశాల్లోనూ చ‌ర‌ణ్ కి అభిమానులు ఏర్ప‌డ్డారు. హాలీవుడ్ పిలిచి మ‌రీ అవ‌కాశాలు ఆఫ‌ర్ చేసింది. చ‌ర‌ణ్ హాలీవుడ్ కి వ‌స్తే అవ‌కాశాలివ్వ‌డానికి మేం సిద్దం అంటూ మేక‌ర్స్ బాహాటంగానే ప్ర‌క‌టించారు.

జెమ్స్ కామోరూన్ లాంటి లెజెండ‌రీ ద‌ర్శ‌కుడి సైతం చ‌ర‌ణ్ ..రాజ‌మౌళి పనిత‌నాన్ని ప్ర‌శంసించ‌కుండా ఉండ లేక‌పోయారు. క‌మ‌ర్శియ‌ల్ యాస్పెక్ట్ లో సినిమా మేకింగ్ విధానం త‌న‌కెంతో న‌చ్చింద‌ని ప్ర‌శంస కురిపించారు. టెక్నిక‌ల్ గానూ సినిమాను హైలైట్ చేసారని కీర్తించారు. ఇక అదే సినిమాలో `నాటు నాటు` పాట‌కు గానూ ఆస్కార్ అవార్డు సైతం అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ అవార్డుతో ప్ర‌పంచ వ్యాప్తంగా `ఆర్ ఆర్ ఆర్` కి మ‌రింత గుర్తింపు ద‌క్కింది.

అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ల దృష్టిలోనూ సినిమా ప‌డింది. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్..తార‌క్ ల‌పై ప్ర‌త్యేక ఇంటర్వ్యూలు సైతం అప్ప‌ట్లో నెంట్టింట వైర‌ల్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే గత ఏడాది ప్రముఖ విదేశీ స్టార్ ఫిక్స్ మ్యాగజైన్ పై చరణ్ ఫోటో క‌వ‌ర్ పేజీపై అచ్చు అయింది. అది అప్ప‌ట్లో నెట్టింట వైర‌ల్ అయింది.

అంత‌ర్జాతీయ క‌వ‌ర్ పేజీపై ఇలా ఓ భార‌తీయ న‌టుడి ఫోటో ప‌డ‌టం ఇంత‌వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు. దీంతో చ‌ర‌ణ్ కి అదో గౌర‌వంగా మారింది. తాజాగా హాలీవుడ్ దర్శకుడు, `జురాసిక్ పార్క్` దర్శకుడు జోయీ జాన్ స్టన్ అదే మ్యాగ‌జైన్ చదవడం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆ మ్యాగ‌జైన్ జోయి చ‌దువుతోన్న ఓ పిక్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Tags:    

Similar News