నడము సొగసులో టెలివిజన్ నటి గ్లామర్ బ్లాస్ట్

దీంతో జ్యోతి పూర్వజ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ మంది వెతుకుతున్నారు.

Update: 2024-09-12 17:56 GMT

ఈ మధ్యకాలంలో తన గ్లామర్ తో సోషల్ మీడియాలో షేక్ చేస్తోన్న బ్యూటీ ఎవరంటే జ్యోతి పూర్వజ్ అని చాలా మంది చెబుతారు. ఈ బ్యూటీ పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అమ్మడు బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పాల్గొనబోతోందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జ్యోతి పూర్వజ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ మంది వెతుకుతున్నారు.


కర్ణాటకకి చెందిన జ్యోతి పూర్వజ్ జ్యోతి రాయ్ పేరుతో సీరియల్స్ లో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ లో హీరో తల్లి పాత్రలో జ్యోతి రాయ్ నటించింది. ఆ సీరియల్ జ్యోతి రాయ్ కి మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. తరువాత టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుకు పూర్వజ్ తో కొంతకాలం లివింగ్ రిలేషన్ లో ఉంది. సుకు పూర్వజ్ దర్శకత్వంలో మాస్టర్ పీస్ అనే సినిమాలో జ్యోతి రాయ్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది.

సుకు పూర్వజ్ ని వివాహం చేసుకున్న తర్వాత తన పేరుని జ్యోతి పూర్వజ్ గా ఈ బ్యూటీ మార్చుకుంది. పేరుతో పాటు ఆమె లుక్, స్టైల్ పూర్తిగా మార్చేసింది. వర్క్ అవుట్స్ బాగా చేస్తూ పెర్ఫెక్ట్ ఫిట్నెస్ తో యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే స్థాయిలో మెస్మరైజ్ చేస్తోంది. రెగ్యులర్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ ని జ్యోతి పూర్వజ్ షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి.

ఇదిలా ఉంటే తాజాగా జ్యోతి పూర్వజ్ వైట్ కలర్ సిల్క్ శారీలో బ్లాక్ బ్లౌజ్ లో బ్లాక్ అండ్ వైట్ ఫోటో ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలో జ్యోతి అదిరిపోయే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పుడే దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉందనే కామెంట్స్ ఆమె ఫ్యాన్స్ ఇన్ స్టాగ్రామ్ లో పెడుతున్నారు.

సీరియల్ లో జగతి మేడమ్ క్యారెక్టర్ ని మెల్లగా మరిచిపోతున్నామని, జూనియర్ జయప్రదలా ఉన్నారంటూ ఒక నెటిజన్ పోస్ట్ పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి జ్యోతి పూర్వజ్ వస్తే మాత్రం కచ్చితంగా విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకొని టాప్ కంటిస్టెంట్ లలో ఒకరిగా నిలుస్తుందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

Tags:    

Similar News