జగతి.. గ్లామర్ ఫైర్ ఆగేలా లేదు!

తాజాగా ఆమె బ్లాక్ కలర్ షార్ట్ టీషర్ట్, ప్యాంట్ తో ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Update: 2023-11-01 17:30 GMT

గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి అంటే చాలా మందికి గుర్తుకొచ్చే రూపం కళ్ళముందు కదులుతుంది. చీరకట్టులో అచ్చమైన పదహారణాల మహిళగా కనిపించిన ఈ కన్నడ అందం పేరు జ్యోతిరాయ్. ప్రస్తుతం ఈమె ఇన్ స్టాగ్రామ్ సెన్సేషన్ గా మారిపోయింది. పెళ్లి తర్వాత కన్నడ సినిమాలతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమెకి తెలుగులో చేసిన గుప్పెడంత మనసు సీరియస్ మంచి గుర్తింపు తీసుకొచ్చింది.


అయితే సీరియల్ లో కనిపించే ఆమె రూపానికి, బయట ఉన్న అందానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో సెన్సేషన్ గా మారిపోయింది. 40 ఏళ్ళు వస్తోన్న వన్నె తగ్గని అందాలతో హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే ఓంపుసొంపులతో జ్యోతిరాయ్ మెరిసిపోతుంది.

రోజురోజుకి ఈమె అందం రెట్టింపు అయిపోతుందా అనేలా గ్లామర్ షో ఉండటం విశేషం. టాలీవుడ్ కి చెందిన ఒక యంగ్ డైరెక్టర్ తో రిలేషన్ షిప్ లోకి వచ్చిన తర్వాత జ్యోతిరాయ్ లుక్, స్టైల్ అన్ని మారిపోయాయి. ఇదే తన ఒరిజినల్ అని కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా సందర్భాలలో ఇన్ స్టాగ్రామ్ చాట్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

తాజాగా ఆమె బ్లాక్ కలర్ షార్ట్ టీషర్ట్, ప్యాంట్ తో ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నడుము అందాలు చూపిస్తూ వయ్యారంగా చిరునవ్వుతో చూపుల బాణాలు విసురుతోన్న జ్యోతిరాయ్ కి కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తోంది.

అందులో ప్రిట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో కూడా జ్యోతిరాయ్ అందాలతో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతోంది. మరో వైపు రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గర్ల్ గా మారిపోతోంది. మరి ఈ బ్యూటీ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News