మర్డర్ కేసుల్లో జైల్లో ఉన్న నటుడి సినిమాకి ఉత్తమ చిత్రం!
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ పరిశ్రమకి చెందిన ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కటకటాల పాలైన సంగతి తెలిసిందే.
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ పరిశ్రమకి చెందిన ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కటకటాల పాలైన సంగతి తెలిసిందే. మొన్నటివరకూ పరప్పన్ అగ్రహారం జైల్లో ఉన్న దర్శన్ ఇప్పుడు బళ్లారి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన పరివారం...ప్రియురాలు పవిత్రా గౌడ్ కూడా ఇదే కేసులో రిమాండ్ ఖైదీలుగా వివిధ జైల్లో ఉన్నారు. ఆ సంగతి పక్కనబెడితే దర్శన్ నటించిన సినిమా ఇప్పుడు 2024 సైమా అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది.
దర్శన్ హీరోగా నటించిన యాక్షన్ సినిమా `కాటేరా` గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయింది. వసూళ్లలో ఏకంగా ప్రభాస్ నటించిన `సలార్` చిత్రంతోనే స్థానికంగా పోటీ పడింది. ఈ సినిమా 2024 సైమా అవార్లుల్లో భాగంగా ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వడం విశేషం. అలాగే ఇదే సినిమాకి సంగీతం అందించిన హరికృష్ణ కూడా ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్తు తీసుకున్నారు. ఈ చిత్రాన్ని కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా తరుణ్ సుధీర్ తెరకెక్కించారు.
ఇందులో దర్శన్ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. సీనియర్ నటి మాలశ్రీ కుమార్తె ఆరాధన్ రామ్ హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమెకి హీరోయిన్ గా తొలి సినిమా కూడా. ఈసినిమా రిలీజ్ అనంతరమే దర్శన్ చుట్టూ సమస్యలు అల్లుకున్నాయి. రేణుకాస్వామిని అతి కిరాతాకంగా చంపాడు అన్న అరోపణలతో జైల్లో ఉన్నాడు. ఇప్పుడీ సినిమాకి అవార్డు రావడంతో చర్చంచా దర్శన్ గురించి నెట్టింట నడుస్తుంది.
క్షణికావేశంలో గొప్ప జీవితాన్ని కోల్పోతున్నాడు అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి అతను మద్దతుగా నిలిచిన వారు కొందరైతే? దర్శన్ లో కోపాన్ని ఉద్దేశించి మరికొంత మంది స్పందించారు. అతడు నిర్దోశిగా బయటకు వస్తాడని ఇంకొంత మంది ధీమా వ్యక్తం చేస్తున్నారు.