కొడుకుని అప్పుడే రంగంలోకి దించేసిన చంద‌మామ‌!

అంత‌టి ఘ‌నాపాటి కాబ‌ట్టే ఒక్క క్ష‌ణం కూడా వృద్ధా చేయ‌కుండా డ‌బ్బు సంపాదిస్తుంది.

Update: 2024-10-15 07:35 GMT

కాజ‌ల్ అగ‌ర్వాల్ బిజినెస్ స్ట్రాట‌జీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎండార్స్ మెంట్ చేయ‌క‌పోవ‌డం తెలియ‌క పోతే ఆమె ద‌గ్గ‌ర‌కి వెళ్లి అడిగితే స‌రి. నాలుగు రాళ్లు ఎలా వెన‌కేసుకోవాలో చెవిలో ఊదుతుంది. అందుకు కూడా నాకేంటి? అంటుందండోయ్. అంత‌టి ఘ‌నాపాటి కాబ‌ట్టే ఒక్క క్ష‌ణం కూడా వృద్ధా చేయ‌కుండా డ‌బ్బు సంపాదిస్తుంది. ఫాం, ఫేం ఉన్నంత కాలం అమ్మ‌డు యాడ్స్ ఎలా చేసిందో చెప్పాల్సిన ప‌నిలేదు.


ఆ త‌ర్వాత ఇన్ స్టా క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకుంది. త‌ద్వారా ల‌క్ష‌ల్లో ఆదాయం చూసింది. అటుపై గ‌ర్భ‌వ‌తి గా ఉన్న స‌మ‌యంలో బేబి ప్రొడ‌క్ట్ ల్ని ఇన్ స్టాలో ప్ర‌మోట్ చేసి ఆ తొమ్మిది నెల‌ల స‌మ‌యంలో కూడా కాసుల చూసింది. ఇప్పుడు ద‌స‌రా, దీపావ‌ళిని కూడా వ‌ద‌ల‌డం లేదు. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ కుమారుడితో ఉన్న ఓ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దోతీ దుస్తుల్లో కుమారుడిని మాస్తాబు చేసి ముఖానికి మాస్క్ వేసి మ‌రీ ప్ర‌చారం మొద‌లు పెట్టింది.


దీనికి సంబంధించి ఇన్ స్టాలో ఇలా రాసుకొచ్చింది. `దీపావళి ప్రిపరేషన్ జోరందుకుంది. మా ఇల్లు అప్పుడే పండుగ ఉత్సాహంతో కళకళలాడుతోంది. లైట్లు వేయడం నుండి కుటుంబ సమేతంగా సమావే శానికి సిద్ధమయ్యే వరకు మేము అన్ని పండుగ వైబ్‌లలో మునిగిపోతున్నాము. నా చిన్న చాంప్ దీపావళి లుక్ కోసం, నేను ఈ పూజ్యమైన బేబీహగ్ ధోతీ కుర్తా సెట్‌లను ఎంచుకున్నాను. ఇది అన్ని విషయాలను క్లాసిక్‌గా , సౌకర్యవంతంగా ఉంచుతుంది.

వేడుకల సమయంలో పరిగెత్తడానికి ఇది సరైన ఎంపిక . ఫాబ్రిక్ చాలా మృదువైనది మరియు తేలికైనది . రోజంతా సౌకర్యవంతంగా స్టైలిష్‌గానూ ఉంచుతుంది. ఇప్పటికే పండుగ భంగిమలను ప్రాక్టీస్ చే స్తున్నాడు. మీ చిన్నారి కూడా దీపావళి స్టైల్ పరేడ్‌లో పాల్గొనాలనుకుంటున్నారా? నా కోడ్ ఇది అంటూ ఫ్యాషన్ బ్రాండ్ ల‌పై 50% - మిగతా వాటిపై 45% తగ్గింపు కోసం ఉపయోగించండి. ఈ దీపావళిని చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా చేద్దాం` అంటూ పిలుపు నిచ్చింది. చూసారా? కుమారుడితో కూడా అమ్మ‌డు సంప‌ద ఎలా సృష్టిస్తుందో?

Tags:    

Similar News