అంబానీ పెళ్లిలో చందమామ వ్వారెవ్వా!
అందాల చందమామ కాజల్ అగర్వాల్ లేటెస్ట్ డిజైనర్ శారీ అభిమానుల హృదయాలను దోచుకుంది
అందాల చందమామ కాజల్ అగర్వాల్ లేటెస్ట్ డిజైనర్ శారీ అభిమానుల హృదయాలను దోచుకుంది. బ్రౌన్ బార్డర్ తో డిజైన్ చేసిన డార్క్ పింక్ శారీ.. కాంబినేషన్ బ్లౌజ్ లో చందమామ దివ్యమైన రూపం ఫ్యాన్స్ లో చర్చకు వచ్చింది. పెళ్లిలో ఎందరు అందగత్తెలు ఉన్నా కాజల్ స్టన్నర్ గా నిలిచిందని కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా సాగిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పెళ్లి వేడుకల అనంతరం శుభ్ ఆశీర్వాద్ వేడుకలో భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. నవదంపతులకు ఆశీర్వాదాలు అందించేందుకు ఇన్స్టాలోకి వెళ్లిన కాజల్ నూతన వధూవరులకు హృదయపూర్వక నోట్ రాసింది. ఈ జంట జీవితకాలం సంతోషంగా ఉండాలని కోరుకున్న కాజల్ తన భర్తతో కలిసి ఉన్న అందమైన ఫోటోని షేర్ చేసింది. అనంత్ -రాధిక జీవితకాలం ప్రేమతో చాలా సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటున్నాను.. అని రాసారు.
అంబానీల పెళ్లి వేడుకలో కాజల్ అగర్వాల్ రకరకాల డిజైనర్ చీరల్లో కనిపించారు. ఇంతకుముందు పచ్చ రంగు చీరలో తళుక్కుమన్న కాజల్ ఆ తర్వాత ఎంబ్రాయిడరీ లెహంగా సెట్లో అబ్బురపరిచింది. కాజల్ ఈవెంట్లో గొప్ప సాంప్రదాయాన్ని ఎలివేట్ చేసే దుస్తుల్లో మెరిసిపోయింది.
జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహం జరిగింది. మరుసటి రోజు శుభ్ ఆశీర్వాద్ వేడుకతో వేడుకలు కొనసాగాయి. వివిధ రంగాలకు చెందిన అనేక మంది A-లిస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ దంపతులు నవదంపతులను ఆశీర్వదించిన విశిష్ట అతిథులలో ఉన్నారు. అనంత్ - రాధికలకు తన ఆనందాన్ని శుభాకాంక్షలు తెలుపుతూ వేడుక నుండి కాజల్ చాలా ఫోటోలను పోస్ట్ చేసింది. ఆసియాలో అత్యంత సంపన్నుడైన అనంత్ అంబానీ ... ఫార్మాస్యూటికల్ సంస్థల వారసురాలు అయిన రాధికా మర్చంట్ ని పెళ్లాడారు. అంబానీ పెళ్లిలో సందర్భానుసారం డిజైనర్ దుస్తుల్లో కాజల్ ప్రత్యక్షమైంది.
కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ తో భారతీయుడు 2లో నటించింది. తదుపరి భారతీయుడు 3లో కనిపించనుంది. తమిళ చిత్రం కరుంగాపియం, తెలుగులో కార్తీక పేరుతో విడుదలైంది. పలువురు అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా కానీ, కాజల్ ఎందుకనో వదులుకోవడం చర్చనీయాంశంగా మారింది.