బాల‌య్య లో గొప్ప నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలును చూసా!

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ జ‌ర్నీ ఎలా ఉందో తెలిసిందే. పెళ్లైన..తల్లైనా అమ్మ‌డు దూకుడు ఏమాత్రం త‌గ్గ‌లేదు

Update: 2024-06-06 14:30 GMT

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ జ‌ర్నీ ఎలా ఉందో తెలిసిందే. పెళ్లైన..తల్లైనా అమ్మ‌డు దూకుడు ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇంకా చెప్పాలంటే అవ‌కాశాలు పెరిగాయి. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌తో పాటు ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లోనూ అవ‌కాశాలు అందుకుంటుంది. ఆమె న‌టించిన `స‌త్య‌భామ` కూడా రిలీజ్ అవుతుంది. ఈసినిమా హిట్ అయితే గ‌నుక కాజ‌ల్ కి కొత్త ఇమేజ్ ఖాయం. సోలోగానూ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాగ‌ల‌న‌నే ధీమా వ్య‌క్తం చేస్తుంది.

ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో కొత్త అవ‌కాశాలు బాగానే ఉన్నాయి. సౌత్ తో పాటు నార్త్ లోనూ బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ న‌ట‌సింహ బాల‌కృష్ణ గురించి ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి పంచుకుంది. బాల‌కృష్ణ‌లో గొప్ప నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలున్నాయంటూ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. ` రాజ‌కీయాల గురించి నాకు తెలియ‌దు. కానీ బాల‌కృష్ణ‌గారు వ్య‌క్తిగ‌తంగా బాగా తెలుసు. బాల‌య్య అద్భుత‌మైన వ్య‌క్తి.

ఆయ‌న‌లో గొప్ప నాయ‌క‌త్వ ల‌క్ష‌ణా లున్నాయి. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో నియోజ‌క వ‌ర్గం అభివృద్ది చెందుతుంద‌ని` ఆశాభావం వ్య‌క్తం చేసింది. బాల‌కృష్ణ గురించి అడిగితే హీరోయిన్లు అంతా ఎంతో స‌ర‌దాగా ఉంటారు? అని స్పందించి న వారే ఉన్నారు. కానీ బాల‌య్య‌లో నాయ‌క‌త్వం ల‌క్ష‌ణాల గురించి రివీల్ చేసి అభిమానుల గుండెల్లో జోష్ నింపింది. గ‌తంలో బాలయ్య‌-కాజ‌ల్ అగ‌ర్వాల్ భగ‌వంత్ కేస‌రిలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. అమ్మ‌డు బాల‌య్య‌తో న‌టించిన తొలి చిత్ర‌మ‌దే. దీంతో బాల‌య్య త‌దుప‌రి చిత్రాల్లో కూడా కాజ‌ల్ పేరు పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మ‌రి చివ‌రిగా అవ‌కాశం వ‌స్తుందా? లేదా? అన్న‌ది చూడాలి. సీనియ‌ర్ హీరోల‌కు చంద‌మామ మంచి ఛాయిస్ గా క‌నిపిస్తుంది. పారితోషికం ప‌రంగానూ నిర్మాత‌ల‌కు అందుబాటులో ఉంటుంది. దీంతో నిర్మాత‌లు ఆమెకి తొలి ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

Tags:    

Similar News