డూప్ లేకుండా చేసి సర్ ప్రైజ్!
పెళ్లైన తర్వాత తనలో వచ్చిన మార్పులు...పిల్లలు కలిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటిని పరిగణ లోకి తీసుకుని కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నట్లు తెలిపింది.
చందమామ కాజల్ అగర్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలకు పర్పెక్ట్ ఛాయిస్ గా అవకాశాలు అందుకుంటుంది. అలాగే లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సోలోగానూ సత్తా చాటేలా ముందుకు కదులుతుంది. కానీ వృత్తిపరంగా తాను తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. పెళ్లైన తర్వాత తనలో వచ్చిన మార్పులు...పిల్లలు కలిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటిని పరిగణ లోకి తీసుకుని కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలో కంపర్ట్ జోన్ లోనే సినిమాలు చేస్తాను తప్ప..సాహసాలు మాత్రం చేయలేని కరాఖండీగా చెప్పేసింది. నటిగా కంటే ఓ బిడ్డకు తల్లిగా ఉండటం ముఖ్యమని...బేబి పుట్టిన తర్వాత తనలో వచ్చిన మార్పుగా చెప్పు కొచ్చింది. సాహసాలు చేసి ఇప్పుడు కొత్తగా సాధించేది ఏమి ఉంటుందన్నట్లు మాట్లాడింది. ప్రస్తుతం కాజల్ `సత్యాభామ అనే లేడీ ఓరియేంటెడ్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాజల్ కెరీర్ లో ఇదే తొలి ఉమెన్ సెంట్రిక్ చిత్రం.
ఈ సినిమా హిట్ అయితే లేడీ భామగా బాక్సాఫీస్ వద్ద సోలో గా సత్తా చాటే నాయిక అవుతుంది. ఈ క్రమంలో సన్నివేశాల కోసం రిస్క్ లు సైతం తీసుకుంటుందని అంతా భావించారు. కానీ కాజల్ మాటల్ని బట్టి సినిమా కోసం అంతగా రిస్క్ చేయలేదని అంతా భావించారు. కానీ ఆ చిత్ర నిర్మాత మాత్రం యాక్షన్ సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లేకుండా నటించినట్లు చెప్పారు. సన్నివేశాల్లో సహజత్వం కోల్పోకుండా ఉండాలంటే డూప్స్ ఉండకూదని కాజల్ ధైర్యంగా ముందుకొచ్చి ఆ సన్నివేశాలు చేసినట్లు చెబుతున్నారు.
ఈ యాక్షన్ సన్నివేశాల్ని కాజల్ కి ఇబ్బంది లేకుండా డూప్ తోనే షూట్ చేయాలనుకున్నారుట. కానీ కాజల్ ఎలాంటి డూప్ లేకుండా చేసి సర్ ప్రైజ్ చేసిందని, ఎంతో ధైర్యంగా ఆ సన్నివేశాలు చేసిందని నిర్మాత ప్రశంసిం చారు. మరి యాక్షన్ సన్నివేశాలు చేయనని చెప్పిన కాజల్ మాటల్లో నిజమెంత? డూప్ లేకుండా నటించదని చెప్పిన నిర్మాత మాటల్లో వాస్తవమెంతో? క్లారిటీ రావాల్సి ఉంది.