కల్కి2898ఏడీ… అక్కడ బ్రేక్ ఈవెన్ కష్టమే?

ఏ విధంగా చూసుకున్న లాంగ్ రన్ లో ఆంధ్రా, సీడెడ్ లో కల్కి 15 నుంచి 20 కోట్ల మధ్యలో నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Update: 2024-07-07 04:50 GMT

కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీగా మైథాలజీ బేస్ చేసుకొని చేసిన మూవీ కావడంతో అందరిని ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కల్కి సినిమాని ఒకటికి రెండు సార్లు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. నార్త్ అమెరికా, హిందీ స్టేట్స్ లో ఇప్పటికే కల్కి మూవీ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది.

మిగిలిన రాష్ట్రాలలో కూడా కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఓవరాల్ కలెక్షన్స్ పరంగా కల్కి 9రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని క్రాస్ చేసింది. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంగా ఉంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో 168 కోట్ల బిజినెస్ వేల్యూతో రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు 146 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది అని అంటున్నారు దీని మీద క్లారిటీ రావలిసి ఉంది .

తెలుగులో రాష్ట్రాలలో కల్కికి వచ్చిన కలెక్షన్స్ లో 50% నైజాం నుంచి వచ్చాయి. దీంతో నైజాంలో కల్కి బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాటలో నడుస్తోంది. ఇక సీడేడ్, ఆంధ్రాలో మాత్రం కలెక్షన్స్ పరంగా కల్కి లాస్ లోనే ఉంది అని అంటున్నారు. అక్కడ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 22 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సీడెడ్ లో 10 కోట్ల వరకు ఇంకా వసూళ్లని సాధించాల్సి ఉంది.

అలాగే ఆంధ్రాలో 12 కోట్ల వరకు రికవరీ కావాలి. ప్రస్తుతం అక్కడ కల్కి జోరు అయితే తగ్గిందని చెప్పాలి. సీడెడ్ లో 27 కోట్ల బిజినెస్ కల్కి మూవీపైన జరిగింది. అయితే ఇప్పటి వరకు వరకు 16.68 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అడ్వాన్స్ బేస్డ్ గా రాయలసీమ, ఆంధ్రాలో కల్కి 2898ఏడీ రిలీజ్ చేశారు. దీంతో మూవీపైన వచ్చిన లాస్ ని నిర్మాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసుకున్న లాంగ్ రన్ లో ఆంధ్రా, సీడెడ్ లో కల్కి 15 నుంచి 20 కోట్ల మధ్యలో నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచం మొత్తం ఇంపాక్ట్ క్రియేట్ చేసి మంచి వసూళ్లు సాధించిన మూవీకి ఆంధ్రా, రాయలసీమలో మాత్రం నష్టాలు రావడానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. రెండు వారాల పాటు టికెట్ ధరల్ని పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అలాగే రోజుకి ఐదు షోలకి అనుమతి లభించింది. అయిన కూడా కల్కి సినిమాకి ఈ ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రాకపోవడం ఆలోచించాల్సిన విషయమే. మరి ఈ వీకెండ్ లో ఏమైనా పుంజుకుంటుందేమో చూడాలి.

Tags:    

Similar News