కల్కి 2898AD: నెవ్వర్ బిఫోర్ అనేలా బిగ్ ఈవెంట్.. గెట్ రెడీ!

కేవలం ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా ప్రపంచంలోని వివిధ భాషలలో కూడా ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతోంది

Update: 2024-05-21 07:40 GMT

బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా మార్కెట్ కు మరింత బలాన్ని చేకూర్చిన ప్రభాస్ స్టార్ ఇమేజ్ ఇప్పుడు కల్కి 2898 AD సినిమాతో అంతకుమించి అనేలా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. కేవలం ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా ప్రపంచంలోని వివిధ భాషలలో కూడా ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతోంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు వైజయంతి మూవీస్ వారు ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలను నిర్మించారు. అయితే ఈ సినిమా మాత్రం మునుపెన్నడూ లేనంత హై బడ్జెట్లో నిర్మిస్తున్నారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే తన మేకింగ్ విధానంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉన్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారు అని ఎదురుచూస్తున్న ఆడియన్స్ కు మేకర్స్ ఒక అద్భుతమైన ఈవెంట్ తో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 22వ తేదీన రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా, ఎప్పుడూ లేనంత భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు మీడియాతో పాటు చాలామంది అభిమానులు పాల్గొనబోతున్నారు.

దాదాపు 50 వేల మంది అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కల్కి టీమ్, మీడియా మిత్రులతో పాటు ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉంది. వైజయంతి మూవీస్ ప్రమోషన్స్ విషయంలో ఎప్పుడూ కూడా కొత్తగానే ఆలోచిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఇలాంటి ప్రతిష్టాత్మక సినిమా కోసం ఆ సంస్థ అంతకుమించి అనే ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది.

సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక ఈ టైంలో ఒక అద్భుతమైన ఈవెంట్ ద్వారా సినిమా స్థాయిని మరొక లెవెల్ కు తీసుకు వెళ్ళే విధంగా అడుగులు వేస్తున్నారు. కల్కి సినిమాను జూన్ 27వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ,దీపికా పదుకొనె జంటగా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కూడా ఒక స్పెషల్ పాత్రతో ఆకట్టుకోబోతోంది.

ఇక బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలలో కనిపించబోతున్నారు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News