కల్కి2898ఏడీ… బాక్సాఫీస్ లెక్క అస్సలు తగ్గట్లే..
గతంలో ఇలా దేవుడి కథలతో వచ్చిన సినిమాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి.
టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇమాజినేషన్ నుంచి వచ్చిన ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898ఏడీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. సైన్స్ ఫిక్షన్ కి మైథాలజీ యాడ్ చేసి నాగ్ అశ్విన్ చెప్పిన కల్కి కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది. ఇండియన్ మైథాలజీకి భారతీయులు మేగ్జిమమ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉంటారు. అందుకే మైథాలజీ ఎడాప్ట్ చేసుకొని చేసే కథలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
గతంలో ఇలా దేవుడి కథలతో వచ్చిన సినిమాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. మరల తరువాత ట్రెండ్ సోషల్ కాన్సెప్ట్ లతో నడిచింది. అయితే ఈ జెనరేషన్ మళ్ళీ మైథాలజీ కథలు చూడటానికి, తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మన ఇతిహాసాలు, గ్రంథాలలో భాగమైన కథలు, క్యారెక్టర్స్ యొక్క గొప్పతనం దృశ్యరూపంలో ఆశ్వాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగానే కల్కి సినిమాని మెజారిటీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు.
అశ్వద్ధామ, భైరవ, కృష్ణుడి పాత్రలు సినిమాని ఆడియన్స్ కి చేరవేయడంలో ఉపయోగపడ్డాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆరో రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 50+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కల్కి మూవీ అందుకోగలిగిందని తెలుస్తోంది. దీంతో ఓవరాల్ కలెక్షన్స్ 680+ కోట్లు దాటాయి. నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ 150+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందంట.
ఓవర్సీస్ లో 12.75 కోట్ల గ్రాస్ ని ఆరు రోజుల్లో కల్కి 2898ఏడీ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ 100 కోట్ల గ్రాస్ ని ఈ మూవీ క్రాస్ చేసింది. తక్కువ టైంలో 100 కోట్లు అందుకున్న చిత్రంగా నిలిచింది. సోమవారం నుంచి కల్కి మూవీ కలెక్షన్స్ కొంత డ్రాప్ కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం వస్తున్నవి డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పాలి.
ఇదే రేంజ్ లో వసూళ్లు వస్తే లాంగ్ రన్ లో 1000-1200 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు త్వరలోనే ఈ మూవీ పోఫైట్ జోన్ లోకి వెళ్లబోతోందని తెలుస్తోంది. కల్కి మూవీ సక్సెస్ తో పార్ట్ 2 మీద అంచనాలు పెరిగాయి. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 60 శాతం కంప్లీట్ అయ్యింది. ఆ మూవీ రిలీజ్ పై నాగ్ అశ్విన్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడనేది వేచి చూడాలి.