కల్కి 289AD సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంటే..

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "కల్కి 2898 AD" కోసం డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలా మంది సినీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

Update: 2024-06-19 09:57 GMT

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "కల్కి 2898 AD" కోసం డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలా మంది సినీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కథ ప్రేక్షకులను భవిష్యత్తులోని డిస్టోపియన్ కాశీ లోకంలోకి తీసుకువెళ్లనుంది అని ఇదివరకే అప్డేట్స్ తో క్లారిటీ వచ్చేసింది. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్ మరియు దీపికా పడుకోన్ ప్రధాన పాత్రలలో నటించారు.

ఇక భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ముంబైలో సెన్సార్ స్క్రీనింగ్ పూర్తిచేసుకుంది. 3D వెర్షన్‌లో ప్రదర్శించబడిన ఈ చిత్రం, సెన్సార్ అధికారులను ఆశ్చర్యపరిచింది. ప్రదర్శన అనంతరం సెన్సార్ బోర్డు సభ్యులు చిత్రానికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ చిత్రం విజువల్స్, నాగ అశ్విన్ మేకింగ్ విధానం ఆకర్షణీయంగా ఉండడం వీరిని ఆశ్చర్యపరిచిందని చెబుతున్నారు.

స్క్రీనింగ్ చూసినవారు చెప్పిన వివరాల ప్రకారం, ఇంతవరకు భారతీయ తెరపై చూడని విజువల్స్ ఈ చిత్రంలో ఉన్నాయట. కథ కూడా వినూత్నంగా మరియు ఆకట్టుకునేలా ఉందని ప్రశంసలు అందుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడానికి ఈమాత్రం హైలెట్ పాయింట్స్ సరిపోతాయని చెప్పవచ్చు. కథానాయకుడు ప్రభాస్ భైరవ పాత్రలో ఒకవైపు పవర్ఫుల్ గా మరోవైపు మంచి ఫన్ తో నటించడం ప్రేక్షకులను ఆకట్టుకోనుందట.

అలాగే, ఆయన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో, కమల్ హాసన్ కలి అనే పాత్రలో కనిపించనున్నారు. వీరి నటన అంచనాలకు తగిన స్థాయిలో ఉందని, భావోద్వేగాలు మరియు నాటకీయతను బాగా ప్రదర్శించారని సమాచారం. ఇక ఈ కల్కిలో స్పెషల్ అతిథి పాత్రలు సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు కిక్ ఇవ్వడం గ్యారెంటీ అని, ముగింపులో వచ్చే మరో ట్విస్ట్ ఆశ్చర్యపరచనున్నట్లు టాక్.

ఫైనల్ గా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది, ఇక దాదాపు 3 గంటల నిడివి ఉన్నట్లు తెలుస్తోంది. వైజయంతి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. కమల్ హాసన్, శశ్వత ఛటర్జీ, దిశా పటాని, మృణాల్ ఠాకూర్, శోభన, రాజేంద్ర ప్రసాద్ అలాగే ఇతర ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం 3D, 4DX మరియు IMAX ఫార్మాట్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. కల్కి సెన్సార్ రిపోర్ట్ బట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. మరి సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News