కల్కీ.. మళ్ళీ ఈ షాక్ ఏంటి?

గతంలో కంటే ఈసారి గాసిప్స్ ఎక్కువగానే వస్తున్నాయి. సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా 15 శాతం బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది

Update: 2024-02-21 17:10 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా కల్కీ 2898AD. ఈ మూవీ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మాత అశ్విని దత్ దాదాపు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా ఫ్యాన్ వరల్డ్ రేంజ్ కు తగ్గట్టుగా రిలీజ్ అవుతుంది అని ఇదివరకే ఇంటర్వ్యూలలో తెలియజేశారు.

ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ తోనే హైప్ అమాంతంగా పెంచేశారు. ఇక అమితాబ్ బచ్చన్ తో పాటు దీపికా పదుకొనే అలాగే కమల్ హాసన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మరోసారి రిలీజ్ డేట్ విషయంలో కల్కీ టీమ్ పునరాలోచనలో పడినట్లుగా టాక్ మొదలైంది.

గతంలో కంటే ఈసారి గాసిప్స్ ఎక్కువగానే వస్తున్నాయి. సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా 15 శాతం బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన షూటింగ్ ను ఈ నెల లోనే ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా స్టార్స్ కూడా షూట్ పాల్గొన్నారు. అంతా సవ్యంగా కొనసాగుతోంది కానీ సినిమా బజ్ మాత్రం పెరగడం లేదు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా కాస్త ఎక్కువ సమయం పట్టేలా ఉంది.

వైజయంతి మూవీస్ ఎంతో సెంటిమెంట్ గా భావించే మే నెల 9వ తేదీనే కల్కి ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమా పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో మళ్ళీ ఆలోచనలో పడ్డారు. మళ్ళీ ఎప్పుడు విడుదల చేయాలనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రమోషన్స్ విషయంలో కూడా ఒక ప్రణాళిక రచించిన తరువాతే మూవీ రిలీజ్ పై కూడా ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నారు.

అసలే ఈ సినిమా కోసం 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ సంస్థలోనే ఇప్పటివరకు ఏ సినిమాకు ఈ రేంజ్ లో బడ్జెట్ కేటాయించలేదు. ఇక అశ్వినీ దత్ అల్లుడు నాగ్ అశ్విన్ పై మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ గానే ఉన్నారు. అయితే కల్కి నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ గాని టీజర్స్ గాని పెద్దగా హైప్ అయితే క్రియేట్ చేయలేదు. ఇక కొత్త రిలీజ్ డేట్ కు తగ్గట్టుగా మళ్ళీ సాలీడ్ అప్డేట్స్ వదులుతారో లేదో చూడాలి.

Tags:    

Similar News