కల్కి పార్ట్ 2లో ఆ ఇద్దరు హీరోలు

కల్కి 2898ఏడీ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తున్నారు

Update: 2024-07-06 03:59 GMT

కల్కి 2898ఏడీ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలగలిసిన ఈ కథాంశాన్ని ప్రేక్షకులు మూడు గంటల పాటు ఆస్వాదిస్తున్నారు. అందుకే చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న సినిమాకి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ భైరవ పాత్రలో మెయిన్ లీడ్ చేసిన సంగతి తెలిసిందే.

అతను కాకుండా యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించారు. విజయ్ దేవరకొండ అయితే ఏకంగా అర్జునుడిగా కనిపించి మెప్పించాడు. అలాగే రాజమౌళి, ఆర్జీవీ లాంటి డైరెక్టర్స్ కూడా కల్కి పార్ట్ 1లో కనిపించారు. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తాడనే ప్రచారం నడిచింది. కృష్ణుడి పాత్రలో అతనినే చూపిస్తారని టాక్ వినిపించింది.

అయితే కల్కి పార్ట్ 1లో నేచురల్ స్టార్ కనిపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ క్యారెక్టర్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఏదైనా సినిమాలో చిన్నదో, పెద్దదో మనకి తెలిసిన యాక్టర్స్ కనిపిస్తే అందులో వచ్చే ఫీలింగ్ వేరుగా ఉంటుంది. ఆడియన్స్ కూడా స్టోరీకి బాగా కనెక్ట్ అవుతారు. ఇదే ఉద్దేశ్యంతో గెస్ట్ రోల్స్ కోసం స్టార్స్ ని పెట్టడం జరిగిందని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.

కల్కి పార్ట్ 1లో నేచురల్ స్టార్ నాని, నవీన్ పొలిశెట్టిని పెట్టాలని అనుకున్న కానీ కుదరలేదు. అందుకే పార్ట్ 2లో మాత్రం ఎక్కడో ఒక చోట వారిద్దరిని గెస్ట్ రోల్ లో చూపిస్తా అని నాగ్ అశ్విన్ తెలిపారు. పార్ట్ 2 మూవీ షూటింగ్ కొంతభాగం అయ్యిందని, అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశామని నాగ్ అశ్విన్ తెలిపారు. అయితే వాటిని మళ్ళీ రీషూట్ చేయాలని, మొదటి పార్ట్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ బట్టి కల్కి పార్ట్ 2లో కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నట్లు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.

నేచురల్ స్టార్ నాని, నవీన్ ని కల్కి పార్ట్ 2లో నాగ్ అశ్విన్ ఎలాంటి పాత్రలలో చూపిస్తాడా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. విజయ్ దేవరకొండ చేసిన అర్జునుడి క్యారెక్టర్ పార్ట్ 2లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అలాగే భైరవ పాత్ర నిడివి మొదటి పార్ట్ లో కొంత తక్కువగా ఉందని సీక్వెల్ లో కచ్చితంగా అతని క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందని నాగ్ అశ్విన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Tags:    

Similar News